Constable Posts: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై 10కి.మీ బదులుగా 1600 మీటర్లే- కొత్త రూల్ ఇదే!

కానిస్టేబుల్ అభ్యర్థులకు జార్ఖండ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నియామక విషయంలో మార్పులు చేసింది. ఇకపై పురుష అభ్యర్థులు 10కి.మీకు బదులుగా 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళలు 1600మీటర్ల పరుగును 10నిమిషాల్లో పూర్తి చేయాలి.

New Update
jharkhand constable recruitment physical fitness rule changed

jharkhand constable recruitment physical fitness rule changed

కానిస్టేబుల్ అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇకపై రిక్రూట్‌మెంట్ సమయంలో 10 కి.మీ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ నియమాన్ని తాజాగా ప్రభుత్వం సవరణ చేసింది. దాని ప్రకారం.. 10 కి.మీ బదులుగా.. కేవలం 1600 మీటర్లు పరుగులు పెడితే చాలు. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. ఇది కేవలం జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?

కొత్త నిబంధనలు

జార్ఖండ్ క్యాబినెట్ ముఖ్యమైన సమావేశంలో.. సోరెన్ మంత్రి మండలి దాదాపు 31 ప్రతిపాదనలను ఆమోదించింది. అందులో అతి ముఖ్యమైన విషయం.. కానిస్టేబుల్ / ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలలో సవరణ చేశారు. దీంతో అభ్యర్థులు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం 10 కిలోమీటర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు.

Also Read: పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్‌

జార్ఖండ్ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదన ప్రకారం.. రాష్ట్రంలో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం 10 కిలోమీటర్ల పరుగును రద్దు చేశారు. దీని స్థానంలో పురుష అభ్యర్థులు 1600 మీటర్ల పరుగును 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మహిళలు 1600 మీటర్ల పరుగును 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ ప్రతిపాదన ఆమోదంతో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఇది అతి పెద్ద ఉపశమనం అనే చెప్పాలి.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

12 మందికి పైగా మృతి

గత రిక్రూట్‌మెంట్ సమయంలో 12 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతోమంది అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు యువతకు ఉద్యోగాల పంపిణీ కాకుండా చావుబతుకుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

రిక్రూట్‌మెంట్ నియమాలు?

గతంలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే.. పురుష అభ్యర్థులు గంటలో 10కిలోమీటర్లు పరుగులు పెట్టాలి. అదే సమయంలో మహిళలు 40 నిమిషాల్లో 5కిమీలు పరుగెత్తాల్సి ఉండేది. అయితే ఇప్పుడు నిబంధనల సవరణ వల్ల అభ్యర్థులు ఉపశమనం పొందవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment