/rtv/media/media_files/2025/02/11/RJpb4JyF1mpMCEIK04Au.jpg)
JEE Main Results Declared
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఓ విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చు. జనవరి 22 నుంచి 29 వరకు మొదటి సెషన్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రెండో సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
Also Read: ట్రైన్లో ఆ పనులు ఏంట్రా నాయనా.. బాత్రూంలో అలా అడ్డంగా దొరికిపోయిన జంట!
మొదటి విడుత పరీక్షల్లో వచ్చే స్కోర్‌తో సంతృప్తి చెందనివారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో కూడా ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. అనంతరం సామాజిక వర్గాల పరంగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో సత్తా చాటిన వాళ్లకు ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం లభిస్తుంది.
.@NTA_Exams declares result of JEE (Main)- 2025 Session 1 exam.
— All India Radio News (@airnewsalerts) February 11, 2025
Exams were conducted from 22nd to 29th January.
12,58,136 candidates had appeared in session 1 of JEE (Main) exam out of total 13,11,544 registered candidates.
A total of 14 candidates have obtained NTA score of… pic.twitter.com/OdzSBBHl57
Also Read: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ