/rtv/media/media_files/2026/03/31/jaish-chief-masood-azhar-2026-03-31-20-37-26.jpg)
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్‌లో మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో అతను తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు, ఇది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ మూవీ ధురంధర్ రివేంజ్‌లో ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వారు, ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి.. తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయిన వారు.. ఒకానొక సమయంలో వరుసగా అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురవుతుంటారు. వీళ్లందరినీ ఎవరు చంపుతున్నారనేది అర్థం కాదు. సేమ్ ఇదే సీన్ రియల్‌గా వెలుగులోకి వచ్చింది. జైష్-ఎ-మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్ సోదరుడు మృతి చెందాడు. అతడి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరీ మహమ్మద్ తాహిర్ అన్వర్?
మహమ్మద్ తాహిర్ అన్వర్ కేవలం మసూద్ అజార్ సోదరుడు మాత్రమే కాదు, జైషే మహమ్మద్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 1999లో జరిగిన IC-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ ఉదంతంలో ఇతను ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని భారత నిఘా వర్గాలు మొదటి నుంచీ చెబుతున్నాయి. తన సోదరుడు మసూద్ అజార్‌ను భారత జైలు నుంచి విడిపించుకోవడానికి ఇబ్రహీం ఈ హైజాక్ ప్లాన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరణం వెనుక మిస్టరీ
పాకిస్థాన్ మీడియా ప్రకారం, ఇబ్రహీం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది సహజ మరణం కాకపోవచ్చని అనుమానిస్తున్నారు. అతను కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని ఒక వర్గం చెబుతోంది. ఇటీవల పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీం కూడా టార్గెట్ అయ్యాడా అనే కోణంలో సందేహాలు వస్తున్నాయి.
భారత్‌పై ప్రభావం
మసూద్ అజార్ కుటుంబంలో కీలక వ్యక్తి మరణించడం జైషే మహమ్మద్ సంస్థకు పెద్ద దెబ్బ అని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో జరిగిన పఠాన్‌కోట్ దాడి, పుల్వామా దాడి వంటి ఉగ్రవాద చర్యల వెనుక ఈ సంస్థ హస్తం ఉంది. ఇబ్రహీం మరణంతో ఆ సంస్థ అంతర్గత నెట్‌వర్క్‌లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి ఉగ్రవాద నేతల మరణాల విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయదు. ఇబ్రహీం అజార్ విషయంలో కూడా ఇప్పటివరకు పాక్ అధికారులు గానీ, సైన్యం గానీ స్పందించలేదు. మసూద్ అజార్ కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది గోప్యంగా ఉంచబడింది.
Follow Us