lucknow airport: ప్లాస్టిక్ బాక్స్‌లో నెలరోజుల బేబీ.. ఫ్లైట్‌లో కొరియర్..!

లక్నోలో ఓ ప్లాస్టిక్ బాక్స్ లో నెల రోజుల ఐవీఎఫ్ బాబును పెట్టి కొరియర్ చేయాలని చూశారు. ఓ జంట టెస్టుల కోసం ముంబై పంపుతున్న ఆ బాక్స్ రోడ్ ద్వారా డెలవరీ కావాల్సింది.. పొరపాటున ఫ్లైట్ లోకి వెళ్లిందని బ్లూ డార్ట్ కొరియర్ సంస్థ చెబుతుంది.

author-image
By K Mohan
New Update
IVF

ఎయిర్ పోర్ట్ లగేజీ చెక్ చేస్తున్న సిబ్బంది దగ్గరకు ఓ చెక్కపెట్ట బాక్స్ వచ్చింది. అది స్కాన్ చేస్తే అక్కడున్నవారందరూ షాక్ అయ్యారు. లగేజీ చెకింగ్ సిబ్బంది బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో నెల రోజుల నవజాత శిశువు మృతదేహం ఉంది. పిల్లాడి మృతదేహాన్ని కెమికల్స్ మధ్య స్టోర్ చేశారు. ఓ ప్లాస్టిక్ డబ్బాలో ప్యాక్ చేసిన పార్సల్.. బ్లూ డార్ట్ కొరియర్ ఏజెన్సీ దాన్ని డెలివరీ చేస్తోంది. ఆ కొరియర్ బాక్స్ ను పట్టుకొని ఓ ఏజెంట్ కూడా వచ్చాడు. సరిగ్గా ముక్కుపచ్చలారని పిల్లాడిని బాక్స్ లో పెట్టి పార్సల్ చూయండి చూసి డ్యూటీలో ఉన్న సిబ్బంది భయాంధోళనకు గురైయ్యారు. ఈ అమానుష్య ఘటన లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో డిసెంబర్ 3న జరిగింది. 

Also Read: మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!

 

వెంటనే అక్కడున్న ఎయిర్ పోర్టు ఇబ్బంది సీఐఎస్ఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఎంటంటే.. ఆ కొరియర్ తీసుకొచ్చిన వ్యక్తికి కూడా అందులో ఏం ఉందో తెలియదు. పోలీసులు కొరియర్ తీసుకోవడానికి వచ్చిన యువకుడిని, కొరియర్ సంస్థ ఏజెంట్ ని అదుపులోకి తీసుకొని విచారించారు. 

Also Read: ఇది కూడా చదవండి : Meesho: మీషోకి రూ.5 కోట్లు టోకరా.. ఫేక్ ఆర్డర్లు చేస్తూ..

లక్నోకు చెందిన ఓ జంట ఐవీఎఫ్ సెంటర్ నుంచి ముంబైకి బాలుడి మృతదేహాన్ని బ్లూ డార్ట్ కొరియర్ ద్వారా పంపుతున్నారు. అది రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉండే.. కానీ పొరపాటున ఫ్లైట్ డెలవరీకి వచ్చిందని కొరియర్ సంస్థ తెలిపింది. అనంతరం శిశువు మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం నవీ ముంబైకి పంపించారు పోలీసులు.
Also Read: సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు

Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

Advertisment
Advertisment
తాజా కథనాలు