/rtv/media/media_files/2025/01/22/yHX4HrtISmPFdjN98M4X.jpg)
rahul gandhi, rss and BJP Photograph: (rahul gandhi, rss and BJP )
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని ప్రతి సంస్థను నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇప్పుడు మనం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తోపాటు.. భారత రాష్ట్రంతో పోరాడుతున్నామంటూ మాట్లాడారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదని నొక్కి చెబుతూనే, ఆయన ప్రకటన దేశవ్యతిరేక భావాలను ప్రతిధ్వనించే వాక్చాతుర్యాన్ని కలిగి ఉందంటూ విమర్శలకు దారితీసింది. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలో పెద్ద వివాదాన్ని రేకెత్తించాయని చెప్పాలి. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
భారతదేశ జాతీయ గుర్తింపుపై రాహుల్ గాంధీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో "భారతదేశం ఒక దేశం కాదు కేవలం రాష్ట్రాల యూనియన్" అని అన్నారు. రాహుల్ ఇటువంటి ప్రకటనలు చేయడం దేశ అస్తిత్వం పై దెబ్బకొట్టినట్లు అవుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం అని రాహుల్ ప్రకటించడం ద్వారా, పార్లమెంటు, న్యాయవ్యవస్థలపై ఆయనకున్న విధేయతను తెలియజేస్తుందని మండిపడుతున్నారు.
రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ కూడా అగ్నికి ఆజ్యం పోసింది. విదేశీ సంస్థలతో ఆయన సన్నిహితంగా ఉండటం నుండి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను కలవడం వరకు ఆయన చర్యలు రాజకీయ ఎజెండా గురించి ఆందోళనలకు గురిచేస్తున్నాయి. రాహుల్ ప్రకటనలు వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టను, కాంగ్రెస్ పార్టీ వారసత్వాన్ని రెండింటినీ కించపరిచేలా, వర్గాలను దూరం చేసే విధంగా ఉంటున్నాయని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపైనే కాకుండా భారత రాష్ట్రంపై కూడా పోరాడుతోందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు తప్పుబట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం, నిజం బహిర్గతమైందని నడ్దా చెప్పుకొచ్చారు.
Also Read : డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు!