పండుగకు రైలులో ఊరెళ్లే వారికి బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC!

సంక్రాంతి సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్న వారికి ఐఆర్‌సీటీసీ పెద్ద షాకి ఇచ్చింది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది.

New Update
IRCTC Down

IRCTC Down Photograph: (IRCTC Down)

IRCTC: అసలే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అంతేకాకుండా కొన్నిప్రైవేట్‌ కంపెనీలు  వారు రెండవ శనివారం ,ఆదివారం రావడంతో సొంతూర్లకు,బయట ప్రదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ మరోసారి పనిచేయకపోవడంతో టికెట్లు బుక్‌ చేసుకోవడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Also Read: Lal Bahadur Shastri లాల్‌ బహుదర్‌ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!

 IRCTC వెబ్‌సైట్‌ను తెరిచినప్పుడు, టికెట్ బుకింగ్, రద్దు గంట వరకు అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ నెలలో ఏకంగా మూడోసారి డౌన్ అయింది.నిజానికి, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఒక నెలలో మూడోసారి పనిచేయకపోవడంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..!

IRCTC పనిచేయడం లేదని..

తత్కాల్ బుకింగ్ సమయంలో, ప్రజలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు  IRCTC వెబ్‌సైట్ డౌన్ అయింది. వెబ్‌సైట్‌తో పాటు IRCTC యాప్ కూడా డౌన్ అయింది. సమాచారం ప్రకారం, ఉదయం 10:50 గంటలకు IRCTC పనిచేయడం లేదని ప్రజలకు ఫిర్యాదులు వచ్చాయి. తక్షణ టిక్కెట్ బుకింగ్, వెబ్‌సైట్, యాప్‌లో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

IRCTC వెబ్‌సైట్ టికెట్ బుకింగ్‌కే కాకుండా టికెట్ స్టేటస్, PNR వంటి వాటిని తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రజల ఇబ్బందులు పెరిగాయి.

Also Read: Maha Kumbamela 2025: ఒక దేశ జనాభా అంత జనం.. 6 పార్లమెంట్లు కట్టే అంత ఖర్చు.. కుంభమేళా హైలైట్స్ ఇవే!

Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నిర్లక్ష్య డ్రైవింగ్‌.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా

కర్ణాటకలో ఓ బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. 2021లో ఈ ఘటన జరిగింది. అయితే తాజాగా దీనిపై విచారించిన ఓ తాలుకా కోర్టు.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది.

New Update
Karnataka Civil Court

Karnataka Civil Court

కర్ణాటకలో ఓ బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు. 2021లో ఈ ఘటన జరిగింది. అయితే తాజాగా దీనిపై విచారించిన ఓ తాలుకా కోర్టు.. వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది. మరోసారి పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదనే హెచ్చరికలు చేస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొప్పళ జిల్లా యలబుర్గలో 2021లో ఓ 17 ఏళ్ల బాలుడు నిర్లక్ష్యంగా ఆటో నడిపాడు. 

Also Read:  ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

దీంతో రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగావతిలోని జయనగర ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అయ్యనగౌడ(48) అనే ఉద్యోగి.. మరికొందరు వ్యక్తులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రాజశేఖర్ పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.   

Also Read: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

దీంతో ఈ ఘటనపై మృతుడి భార్య చెనమ్మ గంగావతి.. తాలుక న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసును జడ్జి రమేశ్ ఎస్‌.గాణిగెరె విచారించారు. బాలుడు నడిపిన ఆటో యజమానికి ఏకంగా రూ.1,41,61,580 జరిమానా విధించారు. బాలుడని తెలిసినా కూడా ఆటో ఎలా ఇస్తారని.. ఆ ఆటో యజమానిపై మండిపడ్డారు. రాజశేఖర్ కుటుంబంలో ముగ్గురికి సమానంగా ఈ డబ్బును పంచాలని అధికారులకు సూచనలు చేశారు.  

Also Read: టిఆర్‌ఎఫ్ ముసుగులో లష్కర్ ఈ తోయిబా దాడులు.. ఆన్‌లైన్‌లో యువకుల రిక్రూట్‌మెంట్!

Also Read: పహల్గాంలో ఉగ్రదాడి.. తాలిబన్ల సంచలన ప్రకటన!

rtv-news | national-news | karnataka

Advertisment
Advertisment
Advertisment