BIG BREAKING: ఇరాన్‌ సంచలన ప్రకటన.. ప్రజలు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఇరాన్‌ నాగరికతను ఈ రాత్రికి అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ అలెర్ట్ అయ్యింది. భారీగా సైనిక సమీకరణకు సిద్ధం అవుతోంది.

New Update
Iran urges human chains amid Trump threats to wipe out civilization

Iran urges human chains amid Trump threats to wipe out civilization

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ నాగరికతను ఈ రాత్రికి అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ అలెర్ట్ అయ్యింది. భారీగా సైనిక సమీకరణకు సిద్ధం అవుతోంది. దేశకోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపించాలంటూ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) పిలుపునిచ్చింది. ప్రభుత్వ టెలివిజన్‌లో ఈ ప్రకటన చేసింది. యుద్ధంలో పోరాడేవారు యోధులుగా ఎదుగుతారంటూ పేర్కొంది. 

Also Read: ‘ఇరాన్‌ నాగరికతను సైకో హెచ్చరికలు ముగించలేవు’..ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

అయితే రాత్రి సమయాల్లో ఇరాన్‌లో ఉన్న చెక్‌పాయింట్లు, ఇతర కీలక ప్రదేశాల దగ్గర వీళ్లను మోహరించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు కొన్ని గంటల్లో ముగియనుండగా IRGC ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. IRGC అనుబంధ సంస్థ పిల్లలను కూడా సైన్యంలోకి చేర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: పాకిస్థాన్‌లో లాక్‌డౌన్...ఇంధన సంక్షోభంతో విలవిల

యుద్ధంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఇరాన్ అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే కొందరు మైనర్లను ఇరాన్‌ యుద్ధంలోకి దించుతున్నట్లు అంతర్జాతీయా మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత నెలలో ఇరాన్‌లోని ఓ చెక్‌ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఇదిలాఉండగా ఓవైపు ట్రంప్‌.. ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ హెచ్చరిస్తుండగా.. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం రాత్రి నాటికి ఈ గడువు ముగియనుంది. మరికొన్నిగంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఎలాంటి దాడులు జరుగుతాయో అనేదానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.  

Advertisment
తాజా కథనాలు