Iran War: యుద్ధం ఆగుతుందా ? అమెరికా, ఇరాన్ పెట్టిన షరతులు ఇవే

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. 

New Update
Iran Outlines 3 Conditions To End War With US, Israel

Iran Outlines 3 Conditions To End War With US, Israel

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేస్తుండగా.. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చేటుచేసుకుంది. యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో ఈ పోస్టు చేశారు. 

''పశ్చిమాసియాలో ఇరాన్ శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉంది. పాకిస్థాన్, రష్యా నేతలతో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించేందుకు మూడు షరతులు అంగీకరించాలి. ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి. మాకు పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో దురాక్రమణలు జరగకుండా అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని'' మసూద్ పెజిష్కియాన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.  

Also Read: గ్యాస్ సిలిండర్ల దెబ్బ..ఆన్‌లైన్లో ఇండక్షన్ స్టవ్లు ఆఫ్ స్టాక్!

ఇదిలాఉండగా బ్యారెల్‌కు 200 డాలర్లు చెల్లించేందుకు ప్రపంచ దేశాలు రెడీగా ఉండాని గురువారం ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు 1970 తర్వాత అంతటి చమురు కొరతను ఎదుర్కొనేందుకు వ్యహాత్మక నిల్వలను రిలీజ్ చేయాలని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సిఫార్సు చేసింది. ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

ఈ రూట్‌లో వెళ్లే నౌకలపై కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాల నౌకలు ఆ మార్గంలోకి వస్తే అవి పేలిపోయేలా ఇరాన్ నేవల్ మైన్స్‌ అమర్చింది. అయితే  హార్ముజ్ జలసంధి మార్గం గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం కలిగించమని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. అనంతరం ఇరాన్ ఈ ప్రకటన చేసింది. తాజాగా యుద్ధం ముగించేకు కూడా ఇరాన్ సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ వీళ్లు పెట్టిన షరతులకు అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకుంటాయా? లేదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు ట్రంప్‌ కూడా ఇరాన్‌కు పలు షరతులు విధించిచారు. 

బేషరతుగా లొంగిపోవాలి

ఇరాన్ పాలక యంత్రాగం తమకు పూర్తిగా లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. 

అణు కార్యక్రమాన్ని నిలిపివేయడం
ఇరాన్ తమ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నారు. అక్కడ అణు కేంద్రాలను నిర్వీర్యం చేయాలనేదే ఆయన ప్రధాన డిమాండ్

ప్రభుత్వ మార్పు 
ఇరాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తామే స్వాధీనం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాలన మారాలని పిలుపునిచ్చారు.

క్షిపణి వ్యవస్థల విధ్వంసం
 అమెరికా లేదా ఇజ్రాయెల్ వరకు చేరుకోగల బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను పూర్తిగా తొలగించాలన్నారు. 

హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు ఎత్తివేయాలి
ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మార్గంపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. నౌకలను అడ్డుకునే పనులు చేయకూడదని.. ఒకవేళ అడ్డుకుంటే గతంలో కంటే 20 రేట్లు ఎక్కువగా దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఈ క్రమంలోనే ఇరాన్ కూడా యుద్ధం ఆపేందుకు సిద్ధమని తెలిపింది. తాము చెప్పిన మూడు షరతులకు అంగీకరిస్తేనే తాము ఒప్పుకుంటామని పేర్కొంది. దీనిపై అమెరికా,ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. మరీ ట్రంప్ ఇరాన్ షరతులకు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆయన ఇందుకు ఒప్పుకుంటే యుద్ధం ఆగుతుంది. లేదంటూ ఉద్రిక్త పరిస్థితులు అలానే కొనసాగనున్నాయి. 

Also Read: మోనాలిసాది లవ్ లవ్ జిహాద్ ..  డైరెక్టర్ సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు