ఇలా చేస్తేనే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు పెంచినట్లైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. గోవాలోని ఫెజరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు! ఆర్థికాభివృద్ధికి ఆతిథ్య రంగం ఎంతో ముఖ్యమన్న గడ్కరీ దాని ప్రాముఖ్యతను వివరించారు. వ్యాపార కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని తెలిపారు. ఈ రంగానికి తమనుంచి బలమైన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దీనివల్ల విస్తారమైన ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు.. ప్రస్తుతం మోదీ సర్కార్.. ఇప్పుడున్న వాటితో పాటు మరో 18 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇవన్నీ కూడా పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తాయని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం చాలామంది పుణ్యక్షేత్రలు మాత్రమే కాకుండా.. ఆధునిక నగరాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు సుముఖత చూపిస్తున్నారని పేర్కొన్నారు. Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం ఇదిలాఉండగా రాబోయే రెండేళ్లలో భారత్‌లో రవాణా ఖర్చులు జీడీపీలో 9 శాతానికి తగ్గుతాయని ఇటీవల నిర్వహించిన నీతి ఆయోగ్ కార్యక్రమంలో గడ్కరీ తెలిపారు. దేశంలో పలు రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుండటం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో రవాణా వ్యయాల వాటా జీడీపీలో 14 శాతం ఉండగా.. ఐరోపాలోని ప్రధాన దేశాలు, అమెరికాలో ఇవి దాదాపు 12 శాతం ఉన్నట్లు తెలిపారు. ఇక చైనాలో రవాణా వ్యయం కేవలం 8 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం! #telugu-news #national-news #nithin-gadkari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి