IndiGo Flight : గాల్లో ఇంజన్ ఫెయిల్..ఢిల్లీలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.వైజాగ్ నుండి ఢిల్లీకి (6E 579) బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా ఇంజన్ వైఫల్యం చెందినట్లు పైలట్లు గుర్తించారు.

New Update
indigo

ఢిల్లీ విమానాశ్రయంలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.వైజాగ్ నుండి ఢిల్లీకి (6E 579) బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా ఇంజన్ వైఫల్యం చెందినట్లు పైలట్లు గుర్తించారు. విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఉండగా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో పైలట్లు వెంటనే అలర్ట్ అయి, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే 'ఫుల్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. రన్‌వే 28ని సిద్ధం చేసి, అగ్నిమాపక యంత్రాలను అక్కడ మోహరించారు. ఉదయం 10:53 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమాచారం అందగా, ఎయిర్‌పోర్ట్ యంత్రాంగం అంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. అదృష్టవశాత్తూ, ఉదయం 11 గంటల సమయంలో విమానం సురక్షితంగా రన్‌వేపై దిగింది. 

విమానంలో 161 మంది ప్రయాణికులు

ఈ బోయింగ్ 737-800 విమానంలో మొత్తం 161 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, విమానానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందించింది. ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు చిన్న సాంకేతిక లోపం తలెత్తిందని తెలిపింది. ముందుజాగ్రత్త చర్యగా, నిబంధనల ప్రకారం పైలట్లు ప్రయారిటీ ల్యాండింగ్ కోరారని, విమానం క్షేమంగానే ల్యాండ్ అయిందని స్పష్టం చేసింది. 

గత నెలలో కూడా స్పైస్‌జెట్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం ఇలాగే ఇంజన్ సమస్యతో ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బోయింగ్ 737 విమానాల్లోని CFM56 ఇంజన్లు వరుసగా విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది అర్జెంటీనాకు చెందిన ఒక ఎయిర్‌లైన్స్ ఏకంగా ఎనిమిది బోయింగ్ విమానాలను పక్కన పెట్టేసింది.

Advertisment
తాజా కథనాలు