/rtv/media/media_files/2025/03/14/8ihNH0Vg7ws5vQnIdgVQ.jpg)
virginity
Virginity : వర్జినిటీ అనే పదం చాలాకాలంగా చర్చనీయంశంగా ఉన్నది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంది. మహిళల శరీరం, లైంగిక అంశాల గురించి వర్జినిటీ ప్రతిబింబిస్తుంది. నిజానికిఈ భావన శాస్త్రీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా చాలా సంక్లిష్టమైనది.ముఖ్యంగా మహిళల విషయంలో, కన్యత్వం అనేది హైమెన్ అనే పలుచని పొర యొక్క ఉనికితో ముడిపడి ఉంటుందని చాలా కాలంగా భావించేవారు. అయితే ఆ తర్వాత ఇది ఆ తర్వాత మహిళల వ్యక్తిగత అలవాట్లు, నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని కొందరి భావన.
ఇది కూడా చూడండి: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో సంచలన విషయం వెలుగు చూసింది. ఇండియాలో పెళ్లికి ముందే వర్జినిటీ కోల్పోయే ఆడవారి సంఖ్య ఎక్కువవుతుందని తేలింది. నిజానికి భారతీయ మహిళలు సగటున 22.9 సంవత్సరాల వయస్సులో కన్యత్వాన్ని కోల్పోతారని గత అధ్యయనాలు చెప్తున్నాయి. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కన్యత్వాన్ని కోల్పోయే సగటు వయస్సు 17.4 సంవత్సరాలు.గత కొన్ని దశాబ్దాలలో భారతీయ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. విద్య, ఆర్థిక స్థితి, సామాజిక అవగాహన పెరగడం వల్ల యువత తమ జీవితాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
దీని వల్ల కన్యత్వాన్ని కోల్పోయే వయస్సులో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. పెళ్లయినవారితో పోలిస్తే యువతీ,యువకులే ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడంలో ముందుంటున్నారు. ఈ అధ్యయనంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మందితో సెక్స్ చేసినట్లు తెలిసింది. సెక్స్ కోరికలు తీర్చుకోవడంలో పట్టణ మహిళలకంటే గ్రామీణ స్త్రీలు ముందున్నారని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. గ్రామీణ యువతులు 18 ఏళ్లకు, పట్టణ అమ్మాయిలు 20 ఏళ్లకు సెక్స్ చేస్తారని తెలిపింది. కొంత మంది బాలికలు పాఠశాల వయస్సులోనే శృంగారంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
నిజానికి సగటు వయస్సు అనేది ఒక అంచనా మాత్రమే. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా వారి స్వంత నిర్ణయాలు తీసుకుంటాడు. సమాజం, కుటుంబం, మతం వంటి అనేక కారకాలు వ్యక్తుల లైంగిక నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. లైంగిక సంబంధాలకు ముందు ఆరోగ్యం గురించి సరైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. లైంగిక సంబంధం ఒక సంతోషకరమైన అనుభవం కావాలంటే, ఇద్దరు భాగస్వాములు ఒకరికొకరు ప్రేమ, గౌరవం, విశ్వాసంతో ఉండాలి.