రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్ల జనరల్‌ మేనేజర్‌లకు లేఖ రాసింది.నివేదికలను నవంబర్‌ 18 నాటికి పంపించాలని కోరింది.

author-image
By B Aravind
New Update
Train

భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని టికెట్‌ లేని ప్రయాణికులకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అలాగే అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్లలో ఉన్న జనరల్‌ మేనేజర్‌లకు రైల్వేశాఖ లేఖ రాసింది. తనిఖీల నివేదికలను కూడా నవంబర్‌ 18 నాటికి పంపించాలని కోరింది. 

Also Read: వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

అయితే టికెట్‌ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులే ఎక్కువగా ఉన్నారని రైల్వే కమర్షియల్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల గాజియాబాద్‌ - కాన్పుర్‌ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించగా.. పలు రైళ్లలో ఏసీ కోచ్‌లలో వందలాది మంది పోలీసులు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వాళ్లందరికీ కూడా జరిమానా విధించినట్లు చెప్పారు. ఆర్టీఐ వివరాల ప్రకారం చూసుకుంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ ఉల్లంఘనదారులు పట్టబడ్డారు. వాళ్ల నుంచి జరిమానా రూపంలో భారత రైల్వేశాఖ రూ.2,231 కోట్లు వసూలు చేసింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధునిక జిన్నా: తరుణ్ చుగ్

పశ్చిమ బెంగాల్‌లో హింసకు మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అల్లర్లు చెలరేగుతుంటే ముఖ్యమంత్రి మౌనంగా ఉండటాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఖండించారు. తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆదునిక జిన్నాతో పోల్చారు.

author-image
By K Mohan
New Update
CM Mamata Banerjee: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో తీవ్ర అసంతృ‌ప్తి జ్వాలలు ఎగిపిపడుతున్నాయి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 బిజెపిని ప్రశంసించి తగిన ఒక సాహసోపేతమైన చర్య.

ఈ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశంలోని అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ లో హింసా కాండ మొదలైంది. అక్కడ హిందూ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుకాణాలను దోచుకున్నారు. మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత ముస్లిం గుంపులు అల్లర్లు చెలరేగడంతో సంఘాలు పారిపోవాల్సి వచ్చింది. అల్లర్లు లేపి రాళ్లు రువ్వడం, వాహనాలు ధ్వంస చేయడం, నిప్పంటించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సీఎం మమతా బెనర్జీ నోరు మెదపడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హింసాకాండ జరిగిన ప్రాంతం నుంచి భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి చర్యలు ఉగ్రవాదం అదుపు లేకుండా విజృంభిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని బిజెపి విమర్శించింది. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్ , ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ వంటి సీనియర్ రాష్ట్ర బిజెపి నాయకులు టిఎంసి మౌనాన్ని విమర్శించారు. హిందువులను వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టేటప్పుడు టిఎంసి కళ్ళు మూసుకుందని ఆరోపించారు.

Also read: Waqf Board Act: వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ముర్షిదాబాద్‌లో అత్యంత దారుణమైన హింస జరిగినప్పటికీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూర్ వంటి నగరాల్లో నిరసనలు చెలరేగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అస్సాంలోని సిల్చార్‌లో, నిరసనలు హింసాత్మకంగా మారాయి, పోలీసులతో జనాలు ఘర్షణ పడ్డారు. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం ఎన్ని నిరసనలు వస్తున్నా వక్ఫ్ చట్టం విషయంలో వెనక్కి తగ్గేతే లేదని తేల్చి చెప్పింది. బిజెపి నాయకుడు తరుణ్ చుగ్ మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు, మైనారిటీ సంతృప్తి కోసం ఆమె హిందువుల భద్రత తాకట్టు పెట్టారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు వ్యక్తుల మరణాలపై ఆమె మౌనాన్ని ఆయన ఖండించారు. 

Advertisment
Advertisment
Advertisment