ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?

మీరు ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. అయితే వీటికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి.

New Update
train,

భారతదేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థలో రైల్వే ముందు వరుసలో ఉంటుంది. రోజుకు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ట్రైన్‌ ద్వారా ప్రయాణిస్తున్నారు. ఒక పండుగ టైం వచ్చిందంటే ట్రైన్లు కిటకిటలాడాల్సిందే. సాధారణంగా బస్సులకు అధిక ధర ఉండటంతో అందరూ ట్రైన్ జర్నీనే ఎంచుకుంటారు. అదీగాక ట్రైన్ జర్నీ చాలా సేఫ్ అని కూడా ఫీలవుతారు. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

అయితే కొన్ని సార్లు ట్రైన్లు చాలా లేటుగా గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఏకంగా నాలుగైదు గంటలు ఆలస్యంగా నడుస్తుంటాయి. దీనివల్ల ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే సకాలంలో జరగాల్సిన మరికొందరి పనులు జరగవు. దీంతో ఎంతో మంది లబోదిబోమంటారు. అయితే ఇలా జరిగినపుడు ప్రయాణికులు వేలల్లో డబ్బు పరిహారం పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

ఒకవేళ మీరు కూడా రైలు ప్రయాణికులైతే ఇది మీకు బాగా ఉపయోగపడొచ్చు. ట్రైన్ లేటు అయినప్పుడు ప్రయాణికులు ఫోరంను ఆశ్రయించాలి. అనంతరం తగిన కారణం చూపి నష్టపరిహారాన్ని పొందొచ్చు. వీటికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అవేంటంటే..

షరతులు ఏంటంటే?

ట్రైన్ ప్రయాణికుడు రిజర్వేషన్‌ బోగీలో టికెట్ పొంది ఉండాలి. జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్‌లో ప్రయాణించే వారికి ఇది వర్తించదు. 

అయితే ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ సమయం లేటుగా నడిచినపుడే కేసు వేసే వీలుంటుంది. 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. రైల్వే అధికారులు ఆలస్యానికి గల కారణాలను ప్రయాణికుడికి ముందుగా చెప్పినా.. లేదా అదే సమయంలో తెలిపినా.. ఎలాంటి క్లెయిమ్‌ చేయడానికి వీలు పడదు. దీని కోసమనే రైలు మీద యాంటీ ఫాగ్‌ డివైజ్‌ను సెట్ చేస్తున్నారు. 

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

చాలా సమయాల్లో మంచు ఎక్కువగా ఉన్నపుడు లేదా భారీ వరదల సమయంలో ట్రైన్ వేగం తగ్గుతుంది. అప్పుడు ట్రైన్ లేటు అవుతుంది. ఆ సమయంలో యాంటీ ఫాగ్ డివైజ్ అనేది నేరుగా ప్రయాణికుడి ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది. 

ఆ మెసేజ్ ద్వారా ట్రైన్ లేటు అవుతుందని.. దీనిపై తాము చింతిస్తున్నామని తెలుపుతుంది. అందువల్ల ఇలాంటి సమయంలో ప్రయాణికుడు ఫోరంను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు. 

ఇలాంటి ఇన్‌ఫర్‌మేషన్ రైల్వే అధికారులు ఇవ్వకుంటే మాత్రం లాయర్ ద్వారా గానీ, లేదా నేరుగా ఫోరంలో కేసు వేయొచ్చు. దానికి సాక్ష్యంగా ప్రయాణించే ట్రైన్ టికెట్‌ను పెట్టాలి. 

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

మరొక విషయం ఏంటంటే.. ఒక వేళ తుఫాన్లు, ట్రైన్ యాక్సిడెంట్స్ ఇతర కారణాలతో ట్రైన్ లేటు అయితే స్పెషల్ కౌంటర్‌ వద్ద టికెట్ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nainar Nagendran: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.

New Update
Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

Nainar Nagendran declared BJP Tamil Nadu unit president

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అధ్యక్ష పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏకపక్షంగా పదవి ఆయనకే ఖరారైపోయింది. ఈ ఎన్నిక వెనుక అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?

1960లో కన్యాకుమారి జిల్లా వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. 2001, 2011, 2021 ఎన్నికల్లో తిరునల్వేలి స్థానం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001- నుంచి 2006 సమయంలో ఏఐడీఎంకే పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2017లో ఏఐడీఎంకేను వీడి బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

Also Read: సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ బిగ్ షాక్..

ప్రభుత్వ పాలనలో అనుభవం, ప్రజాధారణ, రాజకీయ వ్యూహాలపై పట్టుఉండటంతో అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏఐడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అయితే ఇటీవల రామేశ్వరంలో పాంబన్ వంతెన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ కనిపించారు. వాస్తవానికి బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే పదేళ్ల పాటు ప్రాథమిక సభ్యత్వం ఉడాలి. కానీ పార్టీ అభివృద్ధికి నాగేంద్రన్ కృషి చేయడం వల్ల  ఆయనకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. 

telugu-news | rtv-news | national-news | bjp

Advertisment
Advertisment
Advertisment