Modi-Trump: టారిఫ్‌లు తగ్గించేందుకు మోదీ సర్కార్ చర్యలు..ట్రంప్‌ ఎఫెక్టేనా!

అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు తగ్గించాలని భారత్ యోచిస్తోంది. సుంకాలను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా వస్తువులపై విధిస్తున్న పన్నులు తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్ చేస్తున్నారు.

New Update
trump and modi 1

trump and modi 1

భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సుంకాలు తగ్గించాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు సూచిస్తున్నారు. లేకపోతే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 55 శాతం ఉన్న సుంకాలను 30 శాతానికి తగ్గించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ సుంకాల తగ్గింపు ఏకంగా 23 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఇంకా పరిశీలన దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Digital Frauds: డిజిటల్ మోసాలు...లక్షల సిమ్‌ కార్డులు,వేల వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ చేసిన కేంద్రం!

భారత్, అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చల్లో భాగంగా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా.. దానికి ప్రతిఫలంగా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న వస్తువులపై అమెరికా విధిస్తున్న పన్నుల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటుంది. సుంకాలను 55 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ చర్చలు త్వరలోనే ఫలితాలు ఇస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 50 శాతం కంటే ఎక్కువ వస్తువులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటి విలువ సుమారు 23 బిలియన్ డాలర్లు.

Also Read:  PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ సుముఖంగా ఉన్నప్పటికీ అందుకు ప్రతిగా పన్నుల నుంచి ఉపశమనం పొందాలని కోరుకుంటోంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పరస్పర సుంకాలను విధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి. 55 శాతం అమెరికన్ వస్తువులపై ప్రస్తుతం 5 శాతం నుంచి 30 శాతం వరకు సుంకాలు విధిస్తున్న భారత్ వాటిని తగ్గించడానికి సిద్ధంగా ఉంది.

సుంకాలను తగ్గించాలనే నిర్ణయాన్ని భారత్ తీసుకుంటే.. అది అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అమెరికా విధించే సుంకాలను తగ్గించాలని కోరుకుంటోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ డేటా ప్రకారం.. అమెరికా సగటు సుంకం 2.2 శాతం కాగా.. భారత్ విధించే సుంకం 12 శాతం. అమెరికాకు భారత్‌తో 45.6 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో ముత్యాలు, ఖనిజ ఇంధనాలు, యంత్రాలు, బాయిలర్లు, విద్యుత్ పరికరాలు ఉన్న విషయం తెలిసిందే. వీటిపై సుంకాలు పెరిగితే.. భారతీయ ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఫార్మాస్యూటికల్, ఆటోమోటివ్ ఎగుమతులు కూడా పరస్పర సుంకల కారణంగా తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాల ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 60 శాతం సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా లేదు. అయితే బాదం, పిస్తా, వోట్‌మీల్, క్వినోవాపై సుంకాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ సుంకాలను దశలవారీగా తగ్గించాలని భారత్ కోరుకుంటోంది.

Also Read: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

Also Read: Donald Trump: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment