India: కేంద్రం సంచలనం.. 114 యుద్ధ విమానాలకు గ్రీన్ సిగ్నల్!

భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

New Update
deal

BIG BREAKING: భారత గగనతలానికి ఇప్పుడు మరింత పటిష్టమైన రక్షణ దొరకబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా 114 సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 3.25 లక్షల కోట్ల భారీ ఖర్చుతో కూడిన ఈ డీల్‌కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మన దగ్గర 36 రాఫెల్ విమానాలు ఉన్నాయి, ఇప్పుడు రాబోయే ఈ కొత్త విమానాలతో మన వాయుసేన పవర్ మునుపటి కంటే చాలా రెట్లు పెరగబోతోంది.

వాయుసేనే కాదు, మన నౌకాదళం (నేవీ) కూడా ఇప్పుడు మరింత షార్ప్‌గా తయారు కాబోతోంది. సముద్రంలో శత్రువుల కదలికలను ఇట్టే కనిపెట్టే ఆరు పీ-8ఐ (P-8I) నిఘా విమానాలను అమెరికా నుంచి కొనబోతున్నారు. దీనికోసం దాదాపు రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే మన దగ్గర 12 ఇలాంటి నిఘా విమానాలు ఉన్నాయి, ఇప్పుడు రాబోయే కొత్త వాటితో కలిపి హిందూ మహాసముద్రంపై మన నిఘా మరింత పటిష్టం అవుతుంది..

Also Read :  మాస్‌ కాపీయింగ్‌.. 17 మంది టీచర్లపై కేసు

కేవలం యుద్ధ విమానాలే కాదు

ఇక రాఫెల్(Rafale jets) డీల్ విషయానికొస్తే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరలోనే ఇండియా(india) కు రానున్నారు, ఆ సమయంలోనే ఈ ఒప్పందంపై అధికారిక సంతకాలు జరుగుతాయి. ఇందులో కేవలం యుద్ధ విమానాలే కాదు, వాటిలో వాడే అత్యాధునిక క్షిపణులు, పైలట్లకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్లు, స్పేర్ పార్ట్స్ వంటివన్నీ ప్యాకేజీలో భాగంగానే వస్తున్నాయి. ఇవి కాకుండా నేవీ కోసం ప్రత్యేకంగా మరో 26 రాఫెల్ విమానాలను విడిగా సేకరిస్తున్నారు.

ఈ ఒప్పందాలన్నీ పూర్తయితే, ప్రపంచంలోనే అత్యధికంగా రాఫెల్ యుద్ధ విమానాలను కలిగి ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది. మొత్తంగా మన దగ్గర సుమారు 176 రాఫెల్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ విమానాల తయారీ, రిపేర్లకు సంబంధించిన పనులన్నీ ఇండియాలోనే జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల మన దేశం ప్రపంచస్థాయిలో రక్షణ రంగానికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది.

Also Read :  కాన్పూర్ లంబోర్గిని యాక్సిడెంట్.. టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు