/rtv/media/media_files/2025/03/29/vNPq7JpVJsn6g0U7eqqN.jpg)
Mynmar Earth Quake
మయన్మార్, థాయ్ లాండ్ లలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్ లోనే 690కు పైగా మరణించినట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ లో ఇప్పటివరకు 10 మంది చనిపోగా..ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ భారీ భూకంపం ధాటికి మొత్తంగా మృతుల సంఖ్య 10 వేలు దాకా అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ చెబుతోంది. ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్‌లోని మాండలే నగరంలో జరిగిందని తెలుస్తోంది. రెండు భూకంపాల కేంద్ర స్థానాలూ మాండలే నగరానికి సమీపంలోనే ఉన్నాయి.
మయన్మార్ కు భారత్ సహాయం..
భారీ భూకంపంతో ఛిన్నాభిన్నమైన మయన్మార్క సహాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయు సేనకు చెందిన C130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి మయన్మార్ కు వెళ్ళింది. ఇందులో బాధితులకు అవసరమైన ఫుడ్ తో పాటూ టెంట్లు, స్తీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్ లు, జనరేటర్లు, వైద్య పరికరాలు పంపించారు.
today-latest-news-in-telugu | earth-quake | india | relief
Also Read: Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్