BREAKING: పెట్రోల్, డీజిల్ కొరతపై కేంద్రం సంచలన ప్రకటన

ప్రస్తుతం పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇంధన కొరత లేదని పేర్కొంది. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్‌ ఉందని స్పష్టం చేసింది.

New Update
India has 60 days of oil stocks, one month of LPG supplies, Says Govt

India has 60 days of oil stocks, one month of LPG supplies, Says Govt

దేశంలో పెట్రోల్, డిజీల్ కొరతపై భయాందోళన మొదలైంది. దీంతో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇంధన కొరత లేదని పేర్కొంది. 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ స్టాక్‌ ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం ఈ ప్రకటన చేసింది. ఇంధన కొరతపై తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read: అందరికీ అలెర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు.. LPG , ATMల నుంచి పాన్‌ కార్డుల వరకు

'' భారత్‌ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్‌గా, అయిదో అతిపెద్ద పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉంది. 150కి పైగా దేశాలకు శుద్ధి చేసిన ఇంధనాలను సరఫరా చేస్తోంది. ప్రతి రిఫైనరీ కూడా 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దేశంలో చమురు కంపెనీల వద్ద 60 రోజులకు సరిపడా ముడిచమురు ఉంది. వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 27 రోజులు అయ్యింది. భౌగోళిక ఉద్రిక్తలతో సంబంధం లేకుండా రెండు నెలల పాటు స్థిరంగా చమురు సరఫరా చేసేందుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 

Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి

ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. దేశీయంగా ఉత్పత్తి పెంచాము. దీనివల్ల గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గింది. LPG కొరత రాకుండా ఉండేందుకు పలు దేశాల నుంచి కార్గోలను తెప్పిస్తున్నాం. ఇంధన కొరతకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇలా తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని'' కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు