/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/jaisankar-jpg.webp)
India Government new law for safety migrants Minister Jaishankar
Indian Migrants: అమెరికా(America) ప్రభుత్వం భారత్(India)కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వెనక్కు వస్తున్న వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వలసలను ప్రోత్సహించేలా చట్టం..
ఇప్పటికే ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని జై శంకర్(Jaya Shankart) చెప్పారు. విదేశాల్లో ఉద్యోగ, సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా ఈ కొత్త చట్టంలో విధివిధానాలు రూపొందించన్నారు.
Also Read : Laila Trailer: విశ్వక్‌సేన్ ‘లైలా’ ట్రైలర్ చూశారా?.. నవ్వులే నవ్వుల్!
సంకెళ్లవి ఫేక్ ఫోటోస్..
ఇక భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది. ‘గతంలోనూ ఇండియా వలసదారులను ఇలాగే పంపించారు. కానీ ఈసారి మన పౌరుల చేతికి బేడీలు వేయడం అవమానకరం' అని థరూర్ మండిపడ్డారు. దీంతో స్పందించిన కేంద్రం.. ఆ ఫొటోల్లో ఉన్నది భారతీయులు కాదని తెలిపింది. ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ డిపార్ట్‌మెంట్ ఆ ఫొటోలపై నిజ నిర్దరణ ప్రక్రియ చేపట్టగా అవి ‘ఫేక్’ అని పీఐబీ వెల్లడించింది.
Also Read : AP Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీపై చంద్రబాబు కీలక ఆదేశాలు!
అమెరికా నుంచి వచ్చిన వారిలో 33 మంది హరియాణా, గుజరాత్‌కు చెందినవారున్నారు. 30 మంది పంజాబ్. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ముగ్గురు. చండీగఢ్ నుంచి ఇద్దరు. 19 మంది మహిళలు, 13 మంది మైనర్లున్నారు.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!