Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..

ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, ఢిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం రావాలనుకున్న చాలా మంది పాకిస్థాన్‌ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ ఒప్పుకోలేదు. దీంతో ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఆడడం డౌట్‌గా మారింది.

New Update
cricket

India Vs Pakistan: 

ఐసీసీ ఛాంపియన్స ట్రఫీ 2025 ఆతిధ్య హక్కులు పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే అక్కడ ఆట జరిగితే తాము వెళ్ళమని భారత్ కరాఖండిగా చెప్పేసింది. సెక్యురిటీ ఇష్యూస్ మూలంగా వెళ్ళేది లేదని చెప్పింది. ఈ విషయాన్ని పీసీబీ..ఐసీసీ కి చెప్పి టోర్నీ హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూడాలని కోరింది. అయితే ఐసీసీ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ లోపే భారత్ కీల నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం చాలా మంది పాకిస్థాన్‌ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించినా అసలు వాటిని చూడను కూడా చూడలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని ప్రకటించింది.

Also Read :  వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

Also Read :  KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

భారత్ నిర్ణయం మీ పాక్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ దేశానికి రమ్మంటే ఎలాగో రాలేదు. కనీసం పాక్ ఆటగళ్ళను అయినా రానివ్వడం లేదని రోపించారు పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్. జట్టులో సగం మందకి ఎలాంటి వివరణ ఇవ్వకుండా వీసా నిరాకరించారని చెప్పుకొచ్చారు. గతేడాది భారత్‌లో పోటీపడి విజయం సాధించిన ఆటగాళ్లతో సహా జట్టులోని సగం మందికి వివరణ లేకుండా వీసాలు ఇవ్వలేదు. పాకిస్తాన్ లేకుండా టోర్నీలు ఆయితే గట్ట దెబ్బే అవుతుందని అన్నారు. 

Also Read :  Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు

Also Read :  KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!

జమ్ము కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

author-image
By Manoj Varma
New Update
Terrorist Attack In Kashmir

Terrorist Attack In Kashmir

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

🔴Pahalgam Terrorist Attack: 

జమ్ము కశ్మీర్‌(Jammu-Kashmir)లో మరోసారి ఉగ్రవాద దాడి(Terrorist Attack) కలకలం రేపింది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) పహల్గాం(Pahalgam) ప్రాంతంలోని బైసరన్(Baisaran) వద్ద మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా  కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఉగ్రవాదులు ప్రత్యేకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది పర్యాటకులు ఉన్నప్పుడు, అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దుండగుల దాడితో కొంతమంది అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సహాయం కోరుతూ పంపిన వీడియోలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే లైవ్ అప్‌డేట్స్‌ను ఇక్కడ ఫాలో అవ్వండి.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

 

  • Apr 23, 2025 15:14 IST

    పహల్గాంలో ఉగ్రవాదుల కోసం కొనసాగుతోన్న భద్రతా దళాల వేట



  • Apr 23, 2025 14:51 IST

    పహల్గాంలో భద్రతను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి అమిత్ షా



  • Apr 23, 2025 14:36 IST

    ఉగ్రదాడిలో మరణించిన వారికి కేటీఆర్ నివాళి



  • Apr 23, 2025 14:32 IST

    ఖండించిన కేఏ పాల్



  • Apr 23, 2025 14:31 IST

    ఉగ్రదాడిని ఖండించిన సీతక్క.. కఠినంగా శిక్షించాలని డిమాండ్



  • Apr 23, 2025 14:16 IST

    మృతుల డెడ్ బాడీలను శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కు తరలిస్తున్న భద్రతా బలగాలు



  • Apr 23, 2025 14:04 IST

    విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్‌.. నేడు జేడీ వాన్స్‌!

    దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.

    Bill Clinton india
    Bill Clinton india

     



  • Apr 23, 2025 13:42 IST

    పహల్గాంలో పుట్టిన రోజు, షూటింగ్ జరుపుకున్నా.. ట్విట్టర్లో విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్



  • Apr 23, 2025 13:41 IST

    ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతల నివాళి



  • Apr 23, 2025 13:40 IST

    రాజ్‌నాథ్‌తో ముగిసిన త్రివిధ దళాధిపతుల సమావేశం

    • త్రివిధ దళాలను అప్రమత్తంగా ఉండాలన్న రాజ్‌నాథ్‌  
    • LOC, కశ్మీర్‌ లోయలో బలగాలను అప్రమత్తం చేసిన కేంద్రం



  • Apr 23, 2025 13:18 IST

    ఆ దుర్మార్గులను వదిలిపెట్టం.. దేశం మొత్తానికి ఇదే నా హామీ.. అమిత్ షా సంచలన ప్రకటన!



  • Apr 23, 2025 13:09 IST

    ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

    జమ్మూ కశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన ఉగ్రదాడిలో 28 మృతి చెందారు. ఈ కుటుంబాలకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలు అయిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.లక్ష ఇస్తామని తెలిపారు. 

    Jammu Attack
    Jammu Attack

     



  • Apr 23, 2025 13:08 IST

    ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

    జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

    deeika
    deeika

     



  • Apr 23, 2025 13:08 IST

    'వాళ్లని వదలొద్దు'.. ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

    పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    Asaduddin Owaisi
    Asaduddin Owaisi

     



  • Apr 23, 2025 13:07 IST

    అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

    west bengal software dead
    west bengal software dead

     



  • Apr 23, 2025 13:00 IST

    మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపేందుకు నేడు సాయంత్రం హైదరబాద్ నెక్లెస్ రోడ్ లో సంతాప ర్యాలీ.. పాల్గొననున్న పవన్



  • Apr 23, 2025 12:54 IST

    ఉగ్రదాడిని ఖండించిన బాబా రాందేవ్



  • Apr 23, 2025 12:41 IST

    కశ్మీర్ లో కొనసాగుతోన్న ఉగ్ర వాదులు వేట



  • Apr 23, 2025 12:38 IST

    ఉగ్రవాదుల దాడి జరిగిన ప్రాంతంలో భారీగా మోహరించిన సైనికులు



  • Apr 23, 2025 12:36 IST

    ఉగ్రదాడి అనుమానితులు

    Terror Attack



  • Apr 23, 2025 12:35 IST

    ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో బీజేపీ నేతల ఆందోళన



  • Apr 23, 2025 12:23 IST

    ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గులు వీరే.. ఫొటోలు విడుదల చేసిన అధికారులు

    జమ్మూ కాశ్మీర్‌లో పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 28 మంది మృతి చెందారు. క్రూరంగా మతం, పేర్లు అడిగి టూరిస్ట్‌లను చంపేసిన ఆ దుర్మార్గుల ఫొటోలను అధికారులు విడుదలు చేశారు. స్కెచ్‌లతో గీసిన ఆ టెర్రరిస్ట్‌ల ఫొటోలను రిలీజ్ చేశారు. 

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 23, 2025 12:23 IST

    మృతులకు అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 12:22 IST

    ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలు విడుదల



  • Apr 23, 2025 12:21 IST

    ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసిన అధికారులు



  • Apr 23, 2025 11:46 IST

    మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన జనసేన



  • Apr 23, 2025 11:44 IST

    ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఓవైసీ.. ఇది నిఘా వైఫల్యమని వ్యాఖ్యలు



  • Apr 23, 2025 11:42 IST

    బాధితుల కన్నీళ్లు



  • Apr 23, 2025 11:35 IST

    ప్రధాని టూర్ లో.. జేడీ వాన్స్ ఇండియాలో.. ముంబై తరహాలో ఉగ్రదాడి..టార్గెట్ ఎవరు?

    చాలా ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడి టూరిస్టులను చంపేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా..అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో ఉండగా ఘటన జరిగింది.. దీంతో ఇరు దేశాలను టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

    Pahalgam Terrorist Attack
    Pahalgam Terrorist Attack

     



  • Apr 23, 2025 11:32 IST

    శ్రీనగర్ లో మృతుల కుటుంబాలకు అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 11:31 IST

    జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన



  • Apr 23, 2025 11:30 IST

    అధికారులతో మోదీ అత్యవసర భేటీ!



  • Apr 23, 2025 11:29 IST

    ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ మిశ్రా తల్లి కన్నీళ్లు



  • Apr 23, 2025 11:28 IST

    అమిత్ షా నివాళులు



  • Apr 23, 2025 11:11 IST

    కాశ్మీర్ పై పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ వ్యాఖ్యలు..వారం రోజులకు అటాక్..మాకేం సంబంధం లేదంటున్న రక్షణ మంత్రి

    కాశ్మీర్ పాక్ జీవనాడి...ఇది పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు. కరెక్ట్ గా వారం రోజుల తర్వాత ఇక్కడ అటాక్ జరిగింది.దీంతో దాడికి ఫాక్ ఆర్మీ వ్యాఖ్యలే ఊతమిచ్చాయని నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి పాక్ కారణమంటున్నారు.

     Pakistan army chief Asim Munir
    Pakistan army chief Asim Munir

     



  • Apr 23, 2025 11:10 IST

    టెర్రరిస్ట్‌ల దెబ్బకు ఆర్మీని చూసి కూడా బెదిరిపోయిన పర్యాటకులు!

    పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది పర్యాటకుల్ని చంపేశారు. దొరికినవారిని దొరికినట్లు చంపేయడంతో మిగిలిన పర్యాటకులు హడలిపోయారు. వారిని కాపాడాటానికి వచ్చిన ఆర్మీ జవాన్లను చూసి కూడా వారు వణికిపోయారు.

    pahalgammm
    pahalgammm

     



  • Apr 23, 2025 11:06 IST

    ఉగ్రదాడి.. అమిత్ షా కు ఫోన్‌ చేసిన రాహుల్, ఖర్గే

    పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరారు.

    Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families
    Kharge, Rahul Gandhi speak to Amit Shah, demand justice for victims' families

     



  • Apr 23, 2025 10:59 IST

    Mohanlal Tweet



  • Apr 23, 2025 10:58 IST

    Kamal Haasan



  • Apr 23, 2025 10:57 IST

    Akshay Kumar



  • Apr 23, 2025 10:57 IST

    Sanjay Dutt



  • Apr 23, 2025 10:56 IST

    Sonu Sood Tweet



  • Apr 23, 2025 10:53 IST

    పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

    అనంత్ నాగ్ లోని పహల్గామ్లో బైసరన్ లోయలో దారుణ మారణకాండకు తామే బాధ్యలము అంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. అయితే దీనికి సూత్రధారి మాత్రం  లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ అని భావిస్తున్నారు. 

    terrorist
    Saifullah Sajid Jutt, a Lashkar-e-Taiba commander

     



  • Apr 23, 2025 10:53 IST

    పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

    జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

    Pahalgam Attack
    Pahalgam Attack

     



  • Apr 23, 2025 10:52 IST

    పహల్గామ్ అటాక్ లో చనిపోయిన మృతుల వివరాలు వెల్లడి..

    కాశ్మీర్ లోని పహల్గామ్ లోని ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 16 మందిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలను ప్రకటించారు. మరో పది మంది క్షతగాత్రుల వివరాలను కూడా పోలీసులు తెలిపారు. 

    Read More



  • Apr 23, 2025 10:51 IST

    పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

    పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.



  • Apr 23, 2025 10:51 IST

    క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

    పహల్గాం ఉగ్రదాడి పై టాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, తారక్‌,చరణ్‌, బన్నీ వంటి వారు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

    tollywood
    tollywood

     

    జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన పర్యాటకుల మీద ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారు. ప్రజల మీద పాశవికంగా దాడి చేశారు. ఆ ఘటనలో మొత్తం 28 మంది మరణించారు. ఈ విషాదం పట్ల  టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ సంతాపాన్ని తెలియజేశారు.

    ''పహల్గం లో 26 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రదాడి‌ అత్యంత దారుణమైన చర్య. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది'' అని చిరంజీవి పేర్కొన్నారు. 

    ''పహల్గాం బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కి పోతుంది. ఈ దాడిలో మరణించిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

    ADVERTISEMENT

    'పహల్గాం టెర్రర్ ఎటాక్ వార్త విని షాక్ అయ్యాను. ఎంతో బాధ కలిగింది. ఈ తరహా ఘటనలకు మన సమాజంలో చోటు లేదు. దీనిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలి. బాధిత కుటుంబాల కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

    ''పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ వార్త విని నా హృదయం ముక్కలైంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని అల్లు అర్జున్ పోస్టు చేశారు. సాయి దుర్గా తేజ్, విష్ణు మంచు సహా పలువురు తెలుగు సినిమా ప్రముఖులు...‌‌ బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, సోనూ సూద్ తదితరులు ఈ దాడిని ఖండించారు.



  • Apr 23, 2025 10:50 IST

    పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు



  • Apr 23, 2025 10:49 IST

    నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు



  • Apr 23, 2025 10:49 IST

    పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

    జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్‌ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్‌ గా అధికారులు గుర్తించారు.



Advertisment
Advertisment
Advertisment