తెలంగాణ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రానికి ఏ కంపెనీ బీర్లు కొత్తగా వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం సరఫరా కంపెనీల ఎంపికలో పారదర్శక విధానాన్ని పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ శాఖపై శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: విజృంభిస్తున్న క్యాన్సర్ కేసులు.. ఆస్పత్రుల్లో పెరుగుతున్న బాధితులు
కొత్త బ్రాండ్ల సరఫరాకు సులుభతరమైన వాణిజ్య విధానాన్ని అనుసరించాలని తెలిపారు. కొత్త కంపెనీలను రాష్ట్రంలోకి తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చే విషయంలో నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపారు. అలాగే నెల రోజుల పాటు సమయం ఇచ్చి బ్రాండ్ల పేరుతో దరఖాస్తులు తీసుకోవాలని తెలిపారు.
Also read: వారానికి 90 గంటల పని వివాదం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
అయితే బీరు ధరను 33.1 శాతం పెంచాలని యూబీఎల్ ఒత్తిడి చేసినట్లు అధికారులు రేవంత్‌కు చెప్పారు. అయితే దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గద్దని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను కూడా పరిశీలించాలని చెప్పారు. విశ్రాంత జడ్జి నేతృత్వంలో కమిటీ నివేదిక మేరకు మాత్రమే ధరల పెంపునకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు కడుతున్నామని రేవంత్ చెప్పారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా చెల్లించాలని చెప్పారు.
Also Read: సంక్రాంతి ఎఫెక్ట్.. ప్రయాణికులకు షాకిస్తున్న విమాన టికెట్ ధరలు
Also Read: లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు