UNION BUDGET 2025: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!

ఎట్టకేలకు వేతన జీవులు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది.ట్యాక్స్ లు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం  కాస్త ఊరటనిచ్చింది.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది.

New Update
tax

Incom Tax Calculater

మధ్య తరగతి ప్రజలు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని...అందుకే ఇన్ కమ్ ట్యాక్స్ లో కీలక మార్పులు చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకే ఇప్పటి వరకు ఉన్న 7 లక్షల ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. దీనివలన రూ.80 వేల వరకు ఉద్యోగులకు మిగులుబాటు అవుతుందని ప్రకటించారు. ఈ ట్యాక్స్ ఎవరెవరికి ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం..

ట్యాక్స్ బెనిఫిట్ ఇలా..

ఒక ఉద్యోగికి ఏడాదికి 12 లక్షల ఆదాయం వస్తే..అందులో నుంచి స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు తీస్తేస్తే..మిగతా డబ్బులు రూ.12 లక్షల మీద ట్యాక్స్ పడుతుంది. ఇందులో నాలుగు లక్షల పై బేసిక్ పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే మిగిలిన మిగతా 8 లక్షల మీదా కొత్త పన్నుల లెక్కల ప్రకారం ట్యాక్స్ విధిస్తారు. మళ్ళీ దీనిలో మొదటి రూ. నాలుగు లక్షలపై రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్ లోని  5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. ఆదాయంలోని మిగిలిన రూ.4 లక్షలపై ‘రూ.8‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్షల నుంచి రూ.12 లక్షల ట్యాక్స్ 10 శాతం పడుతుంది. అంటే రూ.40వేలు. రెండూ కలిపి మొత్తంగా రూ.60వేలు ఏడాదికి ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం రూ.12 లక్షల ఆదాయం వరకు గరిష్టంగా రూ. 60 వేల ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నది కాబట్టి ట్యాక్స్ పేయర్ చెల్లించే పన్ను  జీరో అన్నమాట. అంటే 12 లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులు ఇక మీదట అసలు ఏమీ చెల్లించక్కర్లేదు అన్నమాట. 

ఇందులో ఇంకో విధానం కూడా ఉంది. ఇదే ఉద్యోగికి.. 12 లక్షల 80 వేల ఆదాయం ఉంది అనుకుందాం. దీనిలో కూడా మార్జినల్ కన్సెషన్ ఉంటుంది.  ఇందులో నుంచి రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ తీసేసి...12 లక్షల 5 వేల మీద ట్యాక్స్ లెక్కిస్తారు. ఇందులో నాలుగు లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంటుంది. మిగతా డబ్బులు రూ.8.05 లక్షలపై ట్యాక్స్ పడుతుంది. మొదటి రూ.4 లక్షలపై ‘రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్’​ స్లాబ్​లోని 5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. మిగిలిన రూ.4.05 లక్షల ఆదాయంపై ‘రూ.8 లక్షల నుంచి 12 లక్షల ట్యాక్స్ స్లాబ్​లోని  10 శాతం పన్ను పడుతుంది. అంటే కట్టాల్సి పన్ను 40 వేలు. ిక మిగిలిన 5 వేల ఆదాయం మీదా 12 లక్షల నుంచి 16 లక్షల స్లాబ్ లో 15 శాతం ట్యాక్స్ పడుతుంది. అంటే 750 రూ. పన్ను పడుతుంది. ఇప్పుడు మొత్తం పన్ను విలువ రూ. 60, 750. కానీ ట్యాక్స్ రిబేట్ లిమిట్ 12 లక్షల కంటే కేవలం రూ. 5వేలు మాత్రమే ఎక్కువ ఉండటం వలన మార్జినల్ కన్షెషన్ కింద దానినే ఇన్ కమ్ ట్యాక్స్ కింద పరిగణిస్తారు. దీనికి హెల్త్, ఎడ్యుకేషన్ సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా కలుపుకుంటే మొత్తం ట్యాక్స్​ రూ.5,400 అవుతుంది. 

అయితే మారిన కొత్త పన్నుల రూల్స్ వచ్చే ఏడాది నుంచి అప్లికబుల్ అవుతాయి. ఈ ఏడాది ట్యాక్స్ మాత్రం పాత విధానంలోకే వర్తిస్తాయి. పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. యథాతథంగా ఉంచింది.  ఈ విధానంలో రూ.2.5 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment