water wastage : అలెర్ట్.. కార్లు కడిగితే రూ. 5 వేల ఫైన్.. రిపీట్ చేస్తే వాచిపోద్ది!

గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా వృధా చేస్తే రూ. 5 వేల జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా ప్రకటించింది.

New Update
water board

గత వేసవిలో బెంగళూరు నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయేది వేసవికాలం కావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. తాగునీటిని ఎవరైనా  వృధా చేస్తే భారీ జరిమానా విధించనున్నట్లు వాటర్ బోర్డు తాజాగా  ప్రకటించింది.  తాగునీటిని  కార్ వాష్,  తోటపనితో సహా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే రూ. 5 వేల వరకు జరిమానా విధించబడుతుందని నగర జల బోర్డు తెలిపింది. అంతేకాకుండా పదేపదే నిబంధనలు ఊల్లంఘిస్తే  అదనపు జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది.  

రూ. 5,000 జరిమానా

వాటర్ బోర్డు చట్టంలోని సెక్షన్ 109 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధించబడుతుందని. పునరావృతం అయితే రూ. 5,000 అదనపు జరిమానాతో పాటు, ప్రతి ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించబడుతుందని వాటర్ బోర్డు ప్రకటించింది, ఆ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 1916ను సంప్రదించాలని ప్రజలను కోరారు. బెంగళూరులో 1.40 కోట్ల మంది జనాభా ఉన్నారని, అందరికీ తాగునీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని BWSSB చైర్మన్ డాక్టర్ రామ్ ప్రసాద్ మనోహర్ జారీ చేసిన ఉత్తర్వులో తెలిపారు.  

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఇటీవలి వర్షపాతం లేకపోవడంతో భూగర్భజల మట్టాలు ఇప్పటికే గణనీయంగా తగ్గాయని  వాటర్ బోర్డు పేర్కొంది. సోమవారం బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే మూడు నెలల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తాయని బోర్డు వెల్లడించింది.  

కాగా గత వేసవిలో బెంగళూరు వాసులు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొందన్న సంగతి తెలిసిందే. 14 వేల బోర్‌వెల్స్‌లో సగం ఎండిపోవడంతో నగరానికి రోజుకు 300-500 మిలియన్ లీటర్ల కొరత ఏర్పడింది.  బెంగళూరు నగరానికి కావేరి నది నుండి దాదాపు 1450 MLD (రోజుకు మిలియన్ లీటర్లు) నీరు అవసరం, అలాగే భూగర్భజల వనరుల నుండి అదనంగా 700 MLD నీరు అవసరం పడుతుంది.  

Also Read :  Drawing: భార్యను చంపిన భర్త... పోలీసులకు పట్టించిన నాలుగేళ్ల కూతురి డ్రాయింగ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు

ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.

New Update
India's first train ATM installed on board Panchavati Express

India's first train ATM installed on board Panchavati Express

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం (ATM) సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్‌ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజూ నడిచే ఈ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు చెందిన ఎటీఎంను ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: HCU భూముల వివాదంలో రేవంత్ సర్కార్‌కు షాక్.. సుప్రీంకోర్టు చురకలు

త్వరలో పూర్తిస్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేశామని.. సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫిసర్‌ స్వప్నిల్‌ నీలా తెలిపారు. కోచ్‌లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా వినిగించిన స్థలంలోనే ఏటీఎం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రైలు ముందుకు వెళేటప్పుడు భద్రతా పరంగా ఇబ్బందులు లేకుండా షట్టర్‌ డోర్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కోచ్‌లో కూడా అవసరమైన మార్పులు మన్మాడ్‌ వర్క్‌షాప్‌లో చేశామని స్పష్టం చేశారు.

Also Read: రీల్స్ పిచ్చి.. పిల్లల ముందే గంగలో కొట్టుకుపోయిన తల్లి.. వీడియో వైరల్!

 అయితే ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినల్ నుంచి మన్మాడ్‌ జంక్షన్ వరకు ప్రతిరోజూ పంచవటి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. దాదాపు 4.30 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకంగా ఉంది. అందుకే ముందుగా ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎం సేవలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

telugu-news | national-news | trains

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు