/rtv/media/media_files/2025/03/28/WAq4xWVosLDCMMRqyf99.jpg)
immigration bill 2025 Photograph: (immigration bill 2025)
ఇండియా చొరబాటుదారులకు ధర్మసత్రం కాదని కేంద్రం హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో గురువారం ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025పై చర్చ జరిగింది. అనంతరం ఆ బిల్లు సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పర్యాటకులు లేదా విద్య, వైద్యం, వ్యాపారం కోసం భారత దేశానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అంతేకానీ అక్రమంగా చొరబాటుదారులకు ఇదేం ధర్మసత్రం కాదని చెప్పారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. దేశాభివృద్ధికి సహకరించేందుకు ఎవరైనా భారత్‌కు వస్తే వారికి స్వాగతం పలుకుతామని అన్నారు.
#BREAKING: The Historic Immigration and Foreigners Bill, 2025 Passed in #LokSabha
— BN Adhikari (@AdhikariBN) March 27, 2025
"India is Not A Dharmashala For Illegal immigrants", Says Amit Shah
The #LokSabha has passed the Immigration and Foreigners Bill, 2025. The Bill is intended to modernise the immigration laws and… pic.twitter.com/iDXwkZjHqi
మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు భారత్‌లోకి అక్రమంగా చొరబడుతున్నారని అమిత్ షా గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. దీంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశంలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు పెరిగిపోయారని అన్నారు. దేశ భద్రతకు వారు ముప్పుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో అశాంతి సృష్టించే చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.