పెద్ద చదువులు చదివి సన్యాసం.. కుంభమేళలో IIT బాబా వైరల్

కుంభమేళలో ఓ బాబా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. జేఈఈలో 731వ ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబైలో ఎరోస్పేస్ ఇంజినీరింగ్ చదివాడు. పెద్ద ఉద్యోగాలు లక్షల జీతాలు వదిలేసి అభయ్ సింగ్ 2021లో సన్యాసం తీసుకున్నాడు. అతని ఇంటర్వ్యూలు ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

author-image
By K Mohan
New Update
iit BABA

iit BABA Photograph: (iit BABA)

ఆల్ ఇండియా జేఈఈ ఎంట్రన్స్‌లో 731 ర్యాంక్.. లక్షల జీతం.. లగ్జరీ లైఫ్.. కోట్ల విలువైన ప్రాజెక్టులు అన్నీ వదిలేశాడు. కెనడా వెళ్లాడు అక్కడా ఉండలేక తిరిగొచ్చాడు. ఫొటోగ్రఫీలో ఇంటర్న ఫిప్ చేసి టాప్ మ్యాగజైన్‌లో పని చేశాడు. నెలకు రూ.లక్ష జీతం. అక్కడ కూడా నచ్చలేదని వదిలేశాడు. మొదలు పెట్టిన ప్రతి కొత్త పనిలో విరక్తి పుట్టేది.చదివిందేమో పెద్ద పెద్ద చదువులు.. తీసుకున్నదేమో సన్యాసం. అవును నిజం.. 2025 మహాకుంభమేళలో బయటపడిన ఐఐటీ బాబా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఇతన్ని చూస్తే.. ఎక్కువ చదివితే ఉన్న మతి పోతుంది.. అనే సామెతే గుర్తొస్తోంది.

ఐఐటీ బాంబైలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివాడు. భవ బంధాలు, కుటుంబం, కెరీర్, ఇళ్లు అన్నీ వదిలేసి కాషాయం కప్పాడు. ఆయన గురించి విన్న వారంతా నోర్లు వెల్లబెట్టాల్సిందే. చిన్న వయసులోనే ఆయన ట్రాక్ రికార్డులు పదుల్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఎందుకు సన్యాసం తీసుకున్నాడు? సైంటిస్టు కావాల్సిన అతను సన్యాసిలా ఎందుకు మారాడు? జీవితంలో ఆయన నేర్చుకున్న విషయాలేంటి? దేని కోసం అన్వేషిస్తూ.. జీవితంపై విరక్తి చెంది అతను విభూది రాసుకున్నాడు? చాలా ఆసక్తికరమైన విషయాలు ఐఐటీ బాబా లైఫ్ హిస్టరీలో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చూద్దాం..

దేనికి పనికి రాడి వాడిని, సోమరిబోతుని సన్యాసి అని తిడుతుంటారు. మరో పక్కా సన్యాసిలా మారిన వారిని దైవస్వరూపంగా కొలుస్తాము. ఈ రెండీటికి అసలు పొంతనే లేదు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి గతానికి, వర్తమానానికి సంబంధమే లేదు. మసాని గోరఖ్, బతుక్ భైరవ్, రాఘవ్, మాధవ్, సర్వేశ్వరి, జగదీష్... ఇన్ని పేర్లలో ఆయన పేరు ఏమని చెప్పాలి? అతని అసలు పేరు అభయ్ సింగ్. ఆయన సాధించిన విజయాలు తెలిస్తే.. అవాక్ అవుతారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళకు హాజరైన ఓ బాబా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానం ఆచరించడానికి వస్తున్నారు. అలాగే సాధువులు, సన్యాసులు కూడా మహాకుంభమేళకు వచ్చారు. వారిలో ఓ బాబా గురించి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. 

https://www.instagram.com/abhey_singh/?utm_source=ig_embed&ig_rid=83858694-f7f9-4b1b-a5b5-6f2071c2bd5b

బ్యాక్ గ్రౌండ్ ఇదే

హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన అభయ్ సింగ్ జేఈఈ ప్రవేశ పరీక్షలో 731వ ర్యాంక్‌ సాధించాడు. ఇంటర్మీడియేట్ వరకు తనకు ఐఐటీ గురించి తెలియదట. జేఈఈలో ర్యాంక్ సాధించాలని ఓ సంవత్సరం చదువు ఆపి.. కోచింగ్ తీసుకున్నాడు. తర్వాత ఐఐటీ బాంబైలో ఎరోస్పేస్ ఇంజినీరింగ్ చదివాడు. డబ్బు, ఉద్యోగం కోసం తను చదవుకోలేదని ఐఐటీ బాబా చెబుతున్నాడు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదవడానికి వెళ్లిన అభయ్ సింగ్‌ను తత్వశాస్త్రంతో ప్రభావితమయ్యాడు. పోస్ట్ మాడర్నిజం, ఎపిస్టెమాలజీ అతని ఇన్‌ట్రెస్ట్ పెరిగింది. డిజైనింగ్ పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. ఇంజినీరింగ్‌ పట్టా తీసుకున్నాక మాస్టర్‌ ఇన్‌ డిజైన్‌ చేశాడు. 2 నెలల పాటు ఉత్తరాఖండ్‌లో ఫోటోగ్రఫీ చేసాడు. తర్వాత 2012 నుండి 14 వరకు కోచింగ్‌లో ఫిజిక్స్‌ బోధించాడు. కెనడా వెళ్లాడు. దానికోసం కఠినమైన హైలెస్ట్ పాస్ అయ్యాడు. అక్కడ కూడా ఉండలేక మల్లీ ఇండియాకు తిగిరి వచ్చేశాడు. 2021లో అభయ్ సింగ్ సన్యాసం తీసుకున్నాడు. మనాలీలో కూర్చొని A beautiful place to get lost అనే ఇంగ్లీష్ బుక్ రాశాడు. 

సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు వైరల్

తన జీవితంలో చాలా సందర్భాల్లో చనిపోతానని అనిపించిందని అభయ్ సింగ్ బాబా చెప్పాడు. అలాంటి సందర్భాల తర్వాత ఆయన మనసుకు మించి ఆలోచించడం మొదలు పెట్టాడు. సద్గురువు వద్దకు వెళ్లి, తొమ్మిది నెలలు సద్గురు ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ  అతని అహం నాశనం అయ్యిందట. IIT ముంబై, కెనడా నుంచి వచ్చాను. ఇవన్నీ అక్కడే వదిలేశానని అభయ్ సింగ్ చెప్పాడు. అభయ్ సింగ్ ఖురాన్, హదీత్, బౌద్ధ పుస్తకాలు అన్ని మతాల పుస్తకాలు చదివాడు. చైనా చరిత్ర, ఈజిప్టు, భౌతిక శాస్త్రం, సైన్స్, గణితం, గణాంకాలు, వాస్తుశిల్పం, జ్యోతిష్యం గురించి కూడా చదివాడు. సన్యాసం తీసుకున్నాక చల్లటి నీటితో స్నానం చేయడం ప్రాక్టీస్ చేశనని చెప్పాడు. ఆ బాబా నవ్వుతూ కనిపిస్తున్నాడు. అతని నవ్వుకు సీక్రెట్ ఏంటని ఓ జర్నలిస్ట్ అడగగా.. ఏమి చేయాలి, ప్రపంచం ఎప్పుడైనా అంతం కావచ్చు. నవ్వుతూ చచ్చిపోతానని సమాధానం ఇచ్చాడు. జీవితం గురించి ఆయన చెప్తున్న సత్యాలు చాలా మందిని ఆకర్షితులను చేస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాలో  ఆయన ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. జీవితాన్ని త్యజించడానికి ఐఐటీ బాబా అన్వేక్షిస్తున్నట్లు బాబా చెబుతున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు