Suicide: విషాదం.. విదేశాంగ శాఖ అధికారి ఆత్మహత్య

భారత విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. భవనంపై నుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
IFS officer Jitendra Rawat

IFS officer Jitendra Rawat

భారత విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. భవనంపై నుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విదేశాంగ శాఖకు  చెందిన జితేంద్ర రావత్ అనే అధికారి తన  తల్లితో ఇంట్లో ఉంటున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రదూన్‌లో ఉంటున్నారు.  

Also Read: ''మ్యాథ్స్‌ ఇస్లాం ద్వారా వచ్చింది''.. మరో వివాదంలో షామా మొహమ్మద్

గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఇందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెసిడెన్షియల్‌ సొసైటీలో భవనం టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాకేపోయారు. సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమేదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్‌ లభించలేదని చెప్పారు. 

Also Read: ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండి.. సీఎం రేఖాగుప్తా కీలక వ్యాఖ్యలు

మరోవైపు జితేంద్ర రావత్ మృతిని ధ్రువీకరిస్తూ విదేశాంగ శాఖ  ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి కష్టమైన సమయంలో ఆ కుటుంబానికి అన్ని రకాలుగా సాయం చేస్తున్నామని పేర్కొంది. కేసు విచారణలో ఢిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంబం గోప్యత దృష్ట్యా ఇతర వివరాలు ఏమీ వెల్లడించడం లేదని పేర్కొంది. 

Also Read: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!

Also Read: పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

 

Advertisment
Advertisment
Advertisment