Crime News: నా భార్య కొడుతుంది.. నన్ను క్షమించు నాన్న: భార్య వేధింపులకు మరో భర్త బలి!

భార్య చిత్రహింసలు భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటు చేసుకుంది. ఈ మేరకు తన తండ్రికి సూసైడ్ నోట్‌ రాశాడు. అందులో 'దయచేసి నన్ను క్షమించు నాన్న' అని ఉంది. అలాగే తన భార్య పింకీ తనను కొడుతుందని.. తనను చంపాలనుకుంటోందని ఆరోపించాడు.

New Update
husband commits suicide after getting fed up with wife torture in Hubli city of Karnataka

husband commits suicide after getting fed up with wife torture in Karnataka

కర్ణాటకలోని హుబ్లి నగరంలో దారుణమైన చోటు చేసుకుంది. అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును పోలిన మరో కేసు వెలుగులోకి వచ్చింది. భార్య చిత్రహింసలు భరించలేక ఒక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 'దయచేసి నన్ను క్షమించు నాన్న' అంటూ తన తండ్రికి ఒక నోట్ రాశాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. . .

భార్యాభర్తల మధ్య గొడవలు

కర్ణాటకలోని హుబ్లి నగరం చాముండేశ్వరి నగర్‌లో పీటర్, పింకీ అనే దంపతులు నివాసముంటున్నారు. పీటర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.. . 

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

నాన్న నన్ను క్షమించండి

ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన పీటర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. అతడు ఆత్మహత్య చేసుకుని ఒక సూసైడ్ నోట్ వదిలాడు. ఈ నోట్‌లో 'నాన్న, నన్ను క్షమించండి' అని రాశాడు. తన మరణానికి తన భార్య పింకీ కారణమని పీటర్ ఆరోపించాడు. తన భార్య చిత్రహింసలు భరించలేక చనిపోయినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

తన భార్య పింకీ తనను కొడుతుందని.. తనను చంపాలనుకుంటోంది. అతను ఆరోపించాడు. అంతేకాకుండా ఆ సూసైడ్ నోట్‌లో 'నా భార్యను హింసించడం వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను' అని రాసుకున్నాడు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది.. . .

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు