/rtv/media/media_files/2025/03/15/nG52bJQgIu8zJt83nxCQ.jpg)
chemical laced Holi colours Photograph: (chemical laced Holi colours)
హోలీ రోజు కొందరు యువకులు చేసిన పనికి ఎనిమిది మంది విద్యార్థినీలు హాస్పిటల్‌లో పడ్డారు. కావాలనే ప్రమాదకరమైన రంగులను వారిపై చల్లారు. దీంతో అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థినీలు హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ పట్టణంలో నిన్న (శుక్రవారం) చోటుచేసుకుంది. బైక్‌లపై వచ్చిన కొందరు ఆకతాయిలు బాధితులపై విషపూరిత రంగులు చల్లి పారిపోయారు. ప్రమాదకరమై రసాయనాలతో తయారు చేసిన హోలీ రంగులతో పాఠశాల విద్యార్థినులకు ఛాతీ నొప్పి మరియు ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
Also read: TDP నాయకుడు దారుణ హత్య.. వేటకొడవళ్లతో నరికి నరికి
#Gadag Breaking: 8 Students Fall Ill After Chemical-Laced Colour Attack
— South First (@TheSouthfirst) March 14, 2025
In a shocking incident in Suvarnagiri Tanda, Laxmeshwar taluk, Gadag district, eight students fell ill after being doused with a chemically mixed colour. The attack took place as the students were boarding… pic.twitter.com/gUspVeKadz
కలర్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా.. దర్యాప్తులో హానికరమైన రసాయనాలను ఉపయోగించినట్లు వెల్లడైంది. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్ పట్టణంలో బస్ కోసం ఎదురుచూస్తున్న 8మంది పాఠశాల విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు కెమికల్స్ కలిపిన రంగులు చల్లి పారిపోయారు. కొద్ది సేపటి తర్వాత బాలికలకు అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తున్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిని సందర్శించిన సీనియర్ పోలీసు అధికారులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబాలకు హామీ ఇచ్చారు. రసాయనాలతో కూడిన రంగులలో ఆవు పేడ, గుడ్లు, ఫినాల్ మరియు సింథటిక్ రంగుల ప్రమాదకరమైన మిశ్రమం ఉందని ప్రాథమిక ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలింది. బాధితులు తెలియకుండానే ఆ పదార్థాన్ని కొద్దిగా పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రిఫ్లెక్షన్ సంభవించాయి.
Also read: Firing: కాంగ్రెస్ మాజీ MLAపై కాల్పులు.. ఇంటిపై నలుగురు అటాక్