/rtv/media/media_files/2026/01/15/history-of-cock-fighting-durning-sankranthi-festival-2026-01-15-19-24-32.jpg)
History of cock fighting durning Sankranthi Festival
సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిండివంటలు, గాలిపాటలతో పల్లెల్లు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పందెం కోళ్లతో మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకుంటారు. కోళ్ల పందాలపై చట్టపరమైన ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజలు దీన్ని ప్రాచీన సంప్రదాయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి గోదావరి జిల్లాలో కోళ్ల పందాలు జోరుగా సాగుతుంటాయి. అయితే కోడి పందాలు నిర్వహించడం వెనుక ఓ కథ దాగుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోళ్ల పందాలు అనేవి ఇప్పటివి కావు. వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఒకప్పుడు పౌరుషానికి ప్రతీకగా ఉండేది. పురాతన కాలంలో రాజులు, సామంత రాజులు తమ సైనికుల్లో వీరత్వాన్ని పెంచేందుకు పందెం కోళ్లను పెంచుతుండేవారు. శత్రువుపైకి కోడి ఏ విధంగా వెళ్తుందో.. సైనికులు కూడా అదే పౌరుషాన్ని ప్రదర్శించాలని చూసేవారు. శాతవాహనులు, కాకతీయులు, పల్నాటి యుద్ధ కాలంలో సైతం కోడి పందాలు గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
Also Read: 9 ఏళ్లకు ఇరాన్ వదిలింది.. 31 ఏళ్లకు లండన్ లో శవమై కనిపించింది.. యువరాణి పహ్లవి విషాద కథ!
రక్తపాతం నివారించేందుకు
కోళ్ల పందాలను రక్తపాతం నివారించేందుకు కూడా నిర్వహిస్తుండేవారు. ఇద్దరు రాజుల మధ్య లేదా రెండు వర్గాల మధ్య చిన్నపాటి గొడవలు వచ్చినప్పుడు, వేల సంఖ్యలో సైనికులు చనిపోయారు. ఈ రక్తపాతాన్ని ఆపేందుకే కోళ్ల పందాల ద్వారా సమస్యను పరిష్కరించుకునేవారు. ఎవరి కోడి గెలిస్తే ఓడిపోయిన వాళ్లు వారికి లోంగిపోయేలా ఒప్పందం చేసుకునేవారు. ఈ ఆచారం అలా కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం యుద్ధాలు లాంటివి జరగకపోయినప్పటికీ కోళ్ల పందాలు మాత్రం సంప్రదాయ ప్రకారం నిర్వహిస్తున్నారు.
పలనాటి యుద్ధం
తెలుగు చరిత్రలో ప్రసిద్ధి చెందిన 12వ శతాబ్దం నాటి 'పలనాటి యుద్ధం' వెనుక ఒక కోడి పందమే ప్రధాన కారణమనే కథనం ఉంది. మలిదేవరాజు, నలగామరాజుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు.. నలగామరాజు తరపున నాగమ్మ ఒక కోడి పందాన్ని ప్రతిపాదించింది. ఈ పందెం ప్రకారం ఎవరి కోడి ఓడిపోతే వాళ్లు రాజ్యాన్ని వదిలి 7 ఏళ్లు అరణ్యవాసం చేయాలి.ఈ పందెంలో ఓడిపోవడం వల్లే మలిదేవరాజు వర్గం అడవులకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతుంటారు.అంటే ఇక్కడ యుద్ధానికి బదులు కోడి పందమే తీర్పు ఇచ్చింది. కానీ చివరకు ఇది కూడా పెద్ద యుద్ధానికి దారితీసింది. పురాతన గ్రీస్ వంటి దేశాల్లో కూడా సైనికులకు స్ఫూర్తి నింపడం కోసం కోళ్ల పందాలు నిర్వహించేవారు.
Also Read: బైడెన్ నాలుగేళ్లలో చేసింది.. ట్రంప్ ఏడాదిలోనే చేశాడు.. ప్రపంచాన్ని వణికించే రిపోర్ట్!
Follow Us