/rtv/media/media_files/2025/03/17/UIzZfZtE08ZP3mATlGGY.jpg)
Hindustan Aeronautics Limited Loses 55 Lakh After Payment For Fighter Jet Parts To 'Fake' Company
సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత్‌లో విమానాలు తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థనే మోసం చేశారు. ఏకంగా రూ.55 లక్షలు కాజేశారు. చివరికి హెచ్‌ఏఎల్ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2024 మే నెలలో HAL సంస్థ మూడు ఫైటర్ విమానాలకు సంబంధించి కొన్ని విడి భాగాల కోసం అమెరికాలో ఓ కంపెనీని సంప్రదించింది.
Also Read: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్ టోకరా.. రూ.50 లక్షలు మోసం
దీంతో ఆ సంస్థ కూడా హెచ్‌ఏఎల్‌కు ఈ మెయిల్‌లో బదులిచ్చింది. అయితే ఇదే సమయంలో మరో ఫేక్ ఈ మెయిల్ కూడా ఇందులో చేరింది. దీని ఆధారంగానే సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ఈ సంఘటనను ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. '' విమనాల విడిభాగాల కోసం హెచ్‌ఏఎల్, అమెరికాకు చెందిన పీఎస్ ఇంజినీరింగ్ ఇన్‌కార్పరేషన్ అనే సంస్థను సంప్రదించింది. దీంతో అధికారిక ఈమెయిల్ నుంచే సంప్రదింపులు ప్రారంభమయయ్యాయి.
Also Read: బట్టతలపై భార్య హేళన చేయడంతో.. భర్త ఆత్మహత్య
ఆ తర్వాత మధ్యలో ఎక్కడో ఈ మెయిల్‌లో e అక్షరం లేని మెయిల్ నుంచి సందేశాలు వచ్చాయి. కానీ దీన్ని అధికారులు గుర్తించలేదు. ఆ మెయిల్ చెప్పిన బ్యాంకు ఖాతాకు 63 వేల డాలర్లు (రూ.55 లక్షలు) చెల్లించారు. చివరికీ పీఎస్ ఇంజినీరింగ్ సంస్థ తమకు డబ్బులు రాలేదని చెప్పారు. దీంతో అధికారులు కంగారుపడిపోయారు. ఖాతాలను పరిశీలించగా.. తప్పుడు ఈ మెయిల్ సూచించిన ఖాతాకు డబ్బు వెళ్లినట్లు గుర్తించారని'' సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్ల పేర్కొన్నారు.
Also Read: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు