/rtv/media/media_files/2025/02/06/7rgCBCvhJkJDU09ukPJo.jpg)
Himachal Pradesh amid rain and snowfall educational institutes closed
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భారీగా మంచు, వర్షం కురుస్తోంది. దీంతో శుక్రవారం కొండచరియలు విరిగిపడి కీలక రహదారులు, జాతీయ రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. మంచుతో కూడిన కొండచరియలు విరిగి పడటంతో 5 జాతీయ రహదారులు సహా 583 రోడ్లు మూసివేయబడ్డాయి. అలాగే విద్యుత్ సరఫరాను ప్రభావితం చేసే 2263 DTRల పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు అంతరాయం కలిగింది. అదే సమయంలో అనేక ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
విద్యాసంస్థలు క్లోజ్
కుండపోత మంచు, వర్షాల కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. చంబా, కులు, మనాలిలో కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలు మూసివేయబడినట్లు అధికారులు తెలిపారు. అయితే CBSE బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఈ జిల్లాలకు హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కాంగ్రా, కులు, మండి జిల్లాలతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు, మంచు కురుస్తోంది. ముఖ్యంగా కుండపోత వర్షాల కారణంగా కులు జిల్లాలోని దిగువ ప్రాంతాలలో వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సిమ్లాలోని వాతావరణ కేంద్రం ఈ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది.
రోడ్లు బ్లాక్
గత 15-16 గంటల నుండి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక రోడ్లు, ప్రధాన రహదారులు బ్లాక్ చేయబడ్డాయి. దీంతో కులు, లాహౌల్, స్పితి, కిన్నౌర్, చంబా, సిమ్లా వంటి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి సంబంధాలు తెగిపోయాయి.
ముఖ్యమంత్రి సూచనలు
కులు జిల్లాతో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు ఎదుర్కొంటున్నందున హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. నదులు, వాగులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. ఉదయం నుండి పరిస్థితిని తాను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తాను కులు, లాహౌల్, స్పితి డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడానని అన్నారు.