ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. యమునా నదిని హర్యాణా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కలుషితం చేస్తుందన్న వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తాజాగా హర్యానా మంత్రి విపుల్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తమ ప్రభుత్వం కేసు నమోదుచేయనున్నట్లు పేర్కొన్నారు. యమునా నదిపై కేజ్రీవాల్ చేసిన అసంబద్ధ ఆరోపణల వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన మా ప్రభుత్వంపై చేసిన తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీ ప్రజలకు భయాందోళన చెందుతున్నారని.. ఇలాంటి నిరాధార ఆరోపణలను మేము విడిచిపెట్టమని అన్నారు.
Also Read: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!
కేజ్రీవాల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని.. ఆయన మాటలు అవాస్తవమని నిరూపిస్తామని విపుల్ గోయల్ తేల్చిచెప్పారు. ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం యమునా నదిలోకి ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామ వ్యర్థాలను వదిలుతోందని విమర్శించారు. నదిని విషతుల్యం చేసి ప్రజలను హతమార్చాలని చూస్తోందని మండిపడ్డారు.
Also Read: ఇది 8వ వింత! యువతి కడుపులో బిడ్డ.. ఆ బిడ్డ కడుపులో మరో బిడ్డ!
మరోవైపు ఈ అంశంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా మాట్లాడారు. యమునా నదిని కలుషితం చేయడం జల ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించారు. హర్యానా నుంచి ఢిల్లీకి వస్తున్న యమునా నీటిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. అయితే కేజ్రీవాల్, అతిషి చేసిన ఆరోపణలను ఢిల్లీ జల బోర్డ్ కొట్టేసింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించింది. అలాగే ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని చీఫ్ సెక్రటరీని కోరింది.