🔴Election Results LIVE: హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. కశ్మీర్ లో విజయం దిశగా కాంగ్రెస్ కూటమి!

హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూసుకుపోతుండగా.. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అనూహ్యంగా బీజీపీ దూసుకొచ్చింది. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Manoj Varma
New Update
Haryana - Kashmir Election Counting

  • Oct 08, 2024 18:02 IST
    చిల్లర చేష్టలు చేయకండి.. బీజేపీకి ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్!


  • Oct 08, 2024 18:01 IST
    జమ్మూకశ్మీర్ తుది ఫలితాలు ఇవే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!


  • Oct 08, 2024 18:00 IST
    ఈవీఎం ట్యాంపరింగ్ తోనే బీజేపీ గెలుపు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు!


  • Oct 08, 2024 17:25 IST
    కశ్మీర్ కొత్త సీఎం అతనే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన!


  • Oct 08, 2024 17:23 IST
    జమ్మూ కశ్మీర్ ఫైనల్ రిజల్ట్స్

    ఒక్క సీటు మినహా మొత్తం 89 స్థానాల్లో జమ్మూ కశ్మీర్ లో కౌంటింగ్ పూర్తి.. మొత్తం 90 స్థానాలకు గానూ.. జేకేఎన్ (Jammu & Kashmir National Conference)-42, బీజేపీ-29, కాంగ్రెస్-6, పీడీపీ-3, సీపీఎం-1, ఆమ్ ఆద్మీ పార్టీ-1, ఇండిపెండెంట్-7 చోట్ల విజయం సాధించారు. 



  • Oct 08, 2024 16:08 IST
    హర్యానా కౌంటింగ్ అప్డేట్స్

    హర్యానాలో ఇప్పటివరకు బీజేపీ 25, కాంగ్రెస్ 19 సీట్లలో విజయం



  • Oct 08, 2024 16:07 IST
    జమ్ముకశ్మీర్ ఫలితాలు-Latest Update

    ఇప్పటివరకు 40 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 27 స్థానాల్లో బీజేపీ, 6 చోట్ల కాంగ్రెస్ విజయం. 



  • Oct 08, 2024 15:32 IST
    EC Update: జమ్ముకశ్మీర్ ఫలితాలు

    ఇప్పటివరకు 36 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 26 స్థానాల్లో బీజేపీ, 6 చోట్ల కాంగ్రెస్ విజయం. 



  • Oct 08, 2024 15:30 IST
    హర్యాన ఫలితాలు.. ఈసీ అధికారిక ప్రకటన

    హర్యానాలో కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం మరో 20 చోట్ల ఆధిక్యం. బీజేపీ 13 స్థానాల్లో విజయం.. మరో 38 సీట్లలో లీడింగ్.  



  • Oct 08, 2024 14:31 IST
    హర్యానాలో 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ విజయం: ఈసీ అధికారిక ప్రకటన

    Haryana Results



  • Oct 08, 2024 13:55 IST
    హరియాణాలో బోణీ కొట్టిన కాంగ్రెస్‌... నూహ్‌ అసెంబ్లీ స్థానం నుంచి అఫ్తాబ్‌ అహ్మద్‌ గెలుపు



  • Oct 08, 2024 13:49 IST
    హరియాణాలో బీజేపీకి తొలి విజయం.. జింద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డాక్టర్‌ క్రిషన్‌లాల్‌ మిద్ధా, జమ్మూ నార్త్‌లో బీజేపీ అభ్యర్థి శ్యామ్‌లాల్‌ శర్మ జయకేతనం



  • Oct 08, 2024 13:31 IST
    బీజేపీకి షాక్.. జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ హవా


  • Oct 08, 2024 13:26 IST
    కాంగ్రెస్ కొంపముంచిన అతివిశ్వాసం.. ఓటమికి మూడు ముఖ్య కారణాలివే


  • Oct 08, 2024 13:19 IST
    బీజేపీకి ఊహించని పరాజయం

    జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి ఊహించాని ఓటమి చవి చూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. 51 స్థానాల్లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా... బీజేపీ కేవలం 27 స్థానాలకే పరిమితమైంది.

    P



  • Oct 08, 2024 12:47 IST
    BREAKING: వినేశ్‌ ఫొగట్‌ ఘనవిజయం

    VINNU



  • Oct 08, 2024 12:23 IST
    ఎన్నికల ఫలితాలపై ఈసీ కీలక అప్డేట్

    JK



  • Oct 08, 2024 12:20 IST
    ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ

    కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది. ఉద్దేశపూర్వకంగా డేటాను ఆలస్యంగా ఈసీ వెబ్ సైట్‌లో అప్‌డేట్ చేస్తున్నారని లేఖలో పేర్కొంది. కాగా ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేయనున్నారు కాంగ్రెస్ నేతలు.

    EC LETTER



  • Oct 08, 2024 12:14 IST
    రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ కి బిగ్ షాక్

    హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికి వరకు రెండు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్.. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. కానీ, ఎలాంటి ప్రభావం చూపించలేదు.

     



  • Oct 08, 2024 12:06 IST
    ఈరోజు సాయంత్రం బీజేపీ కార్యకర్తలకు సందేశం ఇవ్వనున్న ప్రధాని మోదీ



  • Oct 08, 2024 12:01 IST
    జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ ఫీవర్

    జమ్మూలో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్- ఎన్సీ కూటమి మెజార్టీ మార్క్ ను దాటింది. 50 స్థానాల్లో ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉంది. 26 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈసారి మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ బొక్కబోర్లా పడింది. కేవలం 5 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది.

    JK RAHUL



  • Oct 08, 2024 11:38 IST
    ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తీజా ముఫ్తీ

    తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ పోస్టు పెట్టారు. నగ్రోటాలో బీజేపీ అభ్యర్థి దేవేందర్‌సింగ్‌ రానా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జమ్మూకశ్మీర్‌ అధ్యక్షుడు తారిఖ్‌ హమీద్‌ లీడింగ్‌లో ఉన్నారు. కుల్గాంలో సీపీఎం అభ్యర్థి మహమ్మద్‌ యూసఫ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    SS



  • Oct 08, 2024 11:34 IST
    హర్యానాలో బీజేపీ దూకుడు.. 50 స్థానాల్లో లీడింగ్



  • Oct 08, 2024 11:13 IST
    హర్యానా ఎన్నికల కౌంటింగ్ @11AM

    హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి సర్వేలకు షాక్ ఇచ్చింది. ఉదయం 11 గంటల వరకు హర్యానాలో.. బీజేపీ-47, కాంగ్రెస్ - 36, INLD- 1, BSP-1, ఇతరులు- 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 



  • Oct 08, 2024 11:02 IST
    తిరిగి కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌



  • Oct 08, 2024 11:00 IST
    హర్యానాలో దూకుడు.. బీజేపీ సంబరాలు షురూ!



  • Oct 08, 2024 10:43 IST
    వెనుకంజలో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌

    vinesh



  • Oct 08, 2024 10:17 IST
    హరియాణా అసెంబ్లీ ఎన్నికలు.. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ



  • Oct 08, 2024 10:11 IST
    కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వినేశ్ ఫొగాట్‌



  • Oct 08, 2024 10:06 IST
    తాజా EC డేటా ప్రకారం.. బీజేపీ- 38, కాంగ్రెస్-36, INLD & BSP ఒక్కొక్కటి చొప్పున ఆధిక్యంలో ఉన్నాయి.

    asas



  • Oct 08, 2024 09:55 IST
    హర్యానాలో పుంజుకున్న బీజేపీ



  • Oct 08, 2024 09:54 IST
    నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్ధుల్లా రెండు స్థానాల్లో ముందంజ

    Omar Abdullah



  • Oct 08, 2024 09:53 IST
    జమ్ము కశ్మీర్‌లో అఫ్జల్‌ గురు సోదరుడు ఎయిజాజ్‌ అహ్మద్‌ గురు ముందంజలో . .



  • Oct 08, 2024 09:45 IST
    హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి ఆధిక్యంలో ఉన్నారు.

    Nayab Singh Saini



  • Oct 08, 2024 09:41 IST
    మేజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్

    జమ్ముకశ్మీర్, హర్యానాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో మేజిక్ ఫిగర్ 46 కాగా.. జమ్ములో కాంగ్రెస్ కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో 45 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. జమ్ములో బీజేపీ అభ్యర్థులు కేవలం 27 స్థానాల్లోనే ఆధిక్యం చూపుతున్నారు.



  • Oct 08, 2024 09:40 IST
    హర్యానా ఎన్నికల కౌంటింగ్ : గర్హి సంప్లా-కిలోయ్‌లో మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపిందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు.

    BPO



  • Oct 08, 2024 09:35 IST
    జమ్మూకశ్మీర్‌లో స్వతంత్ర అభ్యర్థుల జోరు

    J&K ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దేశ రాజకీయాలను హీటెక్కిస్తోంది. 11 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌- 36, బీజేపీ- 22, కాంగ్రెస్‌-7, పీడీపీ -3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.



  • Oct 08, 2024 09:32 IST
    హర్యానా ఎన్నికల కౌంటింగ్.. కాంగ్రెస్- 18, బీజేపీ- 14, INLD -1, ఇతరులు -1 స్థానాల్లో కొనసాగుతున్నారు.

    ASA



  • Oct 08, 2024 09:28 IST
    #హర్యానా ఎన్నికలు | 90 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలకు అధికారిక ఎన్నికల సంఘం ట్రెండ్‌లు ఇలా..    * కాంగ్రెస్ - 6 * బీజేపీ- 4 * INLD -1

    S



  • Oct 08, 2024 09:22 IST
    హర్యానాలో చేతులెత్తేసిన JJP

    హర్యానాలో JJP చేతులెత్తేసింది. గత ఎన్నికల్లో 10 సీట్లతో బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది. పార్టీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలా వెనుకంజలో ఉన్నారు.



  • Oct 08, 2024 09:14 IST
    జమ్మూలో అధికారం దిశగా కాంగ్రెస్ కూటమి

    జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి స్పష్టమైన అధికారం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 సీట్లకు గానూ.. కూటమి 45, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పీడీపీ 9 సీట్లు, ఇతరులు 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు.



  • Oct 08, 2024 09:03 IST
    AICC ఆఫీస్ వద్ద సంబరాలు



  • Oct 08, 2024 08:56 IST
    జిలేబీలు పంచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు



  • Oct 08, 2024 08:44 IST
    కాంగ్రెస్ జోరు.. బోల్తాపడ్డ బీజేపీ

    హర్యానాలో కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ-23 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. JKలో 25 స్థానాల్లో బీజేపీ, 38 స్థానాల్లో కాంగ్రెస్, NC ముందంజలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తోంది.



  • Oct 08, 2024 08:41 IST
    కొనసాగుతున్న మెజారిటీ.. కాంగ్రెస్ సంబరాలు షురూ!

    కాంగ్రెస్ పార్టీలో పండగ వాతావరణం కనిపిస్తోంది. హర్యానా, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు \ప్రారంభించారు. ఢిల్లీ పార్టీ ఆఫీస్ ఎదుట సీట్లు తినిపించుకున్నారు. 



  • Oct 08, 2024 08:30 IST
    కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ ముందంజ

    vinesh phogat



  • Oct 08, 2024 08:26 IST
    6 స్థానాల్లో ఎన్‌సీ ముందంజలో కొనసాగుతుండగా.. 2 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.



  • Oct 08, 2024 08:26 IST
    జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది.



  • Oct 08, 2024 08:19 IST
    BREAKING: బీజేపీకి డౌన్.. కాంగ్రెస్ దూకుడు!

    హర్యానా, J&Kలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్-35, బీజేపీ-12, ఇతరులు -4.. J&Kలో బీజేపీ-15, కాంగ్రెస్-8, పీడీపీ -1గా కొనసాగుతోంది.  



  • Oct 08, 2024 08:11 IST
    జమ్మూ కశ్మీర్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా



Advertisment
Advertisment
తాజా కథనాలు