/rtv/media/media_files/2025/02/09/n9toHBC1PCvieq1UCNnF.jpg)
Ham radio users detect suspicious signals in Urdu, Arabic along India-Bangladesh border
పశ్చిమ బెంగాల్‌లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అక్కడున్న అమెచ్యూర్ హామ్ రేడియో సంస్థ ఈ అనుమానాలు వ్యక్తం చేసింది. గత రెండు నెలల నుంచి ఉర్దూ, బెంగాలీ, అరబిక్ భాషల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్‌ను తమ సంస్థ ఆపరేటర్లు గుర్తించినట్లు హామ్ రేడియో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటం, పాకిస్థాన్ బంగ్లాదేశ్ అధికారులకు సంబంధాలు ఉండటంతో ఈ అనుమానస్పద రేడియో సిగ్నల్స్ ఆందోళనకరమని అధికారులు అన్నారు.
ఉత్తర 24 పర్గాణాస్ జిల్లాలోని బసిర్‌హట్, బొంగావ్, దక్షిణ 24 పర్గాణాస్ జిల్లాలో సుందర్‌బన్స్ ప్రాంతాల నుంచి ఉర్దూ, అరబిక్, బెంగాలి కొడ్‌లలో అనధికార సిగ్నల్స్‌ను గత ఏడాది డిసెంబర్‌లో హామ్ రేడియో ఆపరేటర్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు తెలిపారు. మరికొన్నిసార్లు ఇతర భాషల్లో కూడా సిగ్నల్స్ అందాయని కానీ తాము ముందుగా పట్టించుకోలేదని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో గంగాసాగర్ మేళా జరిగినప్పుడు వినియోగదారులు అనుమానస్పద సంకేతాలు వినిపిస్తున్నట్లు తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత వెంటనే అప్రమత్తమై కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?
అంతేకాదు ఈ కోడ్‌ను డికోడ్ చేసేందుకు కోల్‌కతాలో ఉన్న ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి చెప్పారు. స్మగ్లర్లు, తీవ్రవాద గ్రుపులు చర్చలు జరిపేందుకు ఇలాంటి సంకేతాలు వాడుకుంటాయని తెలిపారు. వీటిని ట్రాక్ చేయడం కష్టమైనా కూడా డీకోట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 2002-2003లో కూడా ఇలాంటి ఘటనే జరిగినట్లు చెప్పారు.
అప్పుడు కూడా ఇలాంటి అనుమానస్పద సిగ్నల్స్ రావడంతో దక్షిణ పర్గాణాస్ జిల్లాలో అక్రమంగా రేడియో స్టేషన్లు నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.2017లో బసిర్‌బాట్‌లో మత ఘర్షణలు జరిగే ముందు హామ్ రేడియో వినియోగదారులు కూడా తమకు అనుమానస్పద రేడియో సిగ్నల్స్ వినిపిస్తున్నట్లు చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో హామ్ రేడియా చాలాసార్లు కీలక పాత్ర పోషించినట్లు స్పష్టం చేశారు.
Also Read: ఢిల్లీ బీజేపీ మాజీ సీఎంలు వీళ్లే.. ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు!