/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T112425.279.jpg)
karimnagar crime
Gujarat Accident: గుజరాత్‌లోని బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఖేంగార్పుర గ్రామం సమీపంలో ఇసుకతో లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. బోల్తా పడిన డంపర్ వారిపైకి దూసుకురావడంతో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. జేసీబీ సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. డంపర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Naga Chaitanya: బ్రేకప్ బాధేంటో నాకు తెలుసు.. సమంతతో విడాకులపై కన్నీరు పెట్టించే చైతూ వీడియో!
దాహోద్ జిల్లాకు చెందినవారు
పోలీసుల వివరాల ప్రకారం.. మృతులందరూ దాహోద్ జిల్లాకు చెందినవారు. పని కోసం వారు అక్కడికి వచ్చారు. అయితే రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో మలుపు వద్ద బయటకు వెళ్లడానికి స్థలం లేదు. అయినప్పటికీ డ్రైవర్ డంపర్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించగా బోల్తా పడినట్లు తెలిపారు.
Also Read: Priyanka Chopra: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ప్రియాంక చోప్రా డాన్స్.. అంబానీ కుటుంబం కూడా.. వీడియో వైరల్!