AI టెక్నాలజీని వాడొద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు

రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ వ్యవస్థలో ఏఐ వాడటాన్ని నిషేధించింది.

New Update
Gujarat High court Bars Ai Use In Decision Making Judgment Drafting

Gujarat High court Bars Ai Use In Decision Making Judgment Drafting

రోజురోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ హైకోర్టు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ వ్యవస్థలో ఏఐ వాడటాన్ని నిషేధించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఏఐ పాలసీని రిలీజ్ చేసింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఎవరూ కూడా తమ అధికారిక విధుల్లో ఏఐను వినియోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.   

Also Read: దేశంలో ఉగ్రవాదులకు పాస్ పోర్టులు, ఆధార్‌లు.. వెలుగులోకి సంచలన నిజాలు

ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియలో మానవ మేధస్సే అత్యంత కీలకమని కోర్టు తెలిపింది. కోర్టు తీర్పులు రాయడం, చట్టాలను విశ్లేషించడం, బెయిల్ ఇవ్వడం, మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేయడం లాంటి కీలక అంశాల్లో ఏఐ ప్రమేయం ఉండకూడదని ఆదేశించింది. అంతేకాదు శిక్షలు ఖరారు చేసేటప్పుడు కూడా కేవలం మానవ విచక్షణ మీదే ఆధారపడాలని, ఏఐ టెక్నాలజీని ప్రామాణికింగా తీసుకోకూడదని పాలసీలో స్పష్టం చేసింది.  

Also Read: మాజీ జవాన్ చదువుల యుద్ధం.. 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డులు!

గుజరాత్‌లోని జిల్లా జ్యుడీషియరీ జడ్జీల సదస్సులో ఈ కొత్త రూల్స్‌ను హైకోర్టు వివరించింది. టెక్నాలజీ వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా న్యాయ నిర్ణయాల్లో ఉండే జవాబుదారీతనమే ముఖ్యమని పేర్కొంది. అందుకే ఏఐని కోర్టు సేవల్లో వినియోగించకుండా నిషేధం విధించింది. ఓవైపు తమ న్యాయవ్యవస్థలో పారదర్శకతను కాపాడుతూ మరో వైపు ఏఐ ద్వారా ఎలాంటి తప్పులు లేకుండా చేయొచ్చని గుజరాత్‌ హైకోర్టు భావిస్తోంది.  

Advertisment
తాజా కథనాలు