/rtv/media/media_files/2024/11/02/xc563cSWBy7CwyLJI5IR.jpg)
UPI
ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.
కారణం తెలియ లేదు..
యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు. దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.
today-latest-news-in-telugu | upi
Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170