/rtv/media/media_files/2026/03/27/govt-2026-03-27-06-57-20.jpg)
Govt to Open Driving Centres in 120 Districts, Target 1 Crore Jobs in 5 Years
కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రానున్న ఐదేళ్లలో ప్రైవేటు రంగంతో కలిసి డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపింది. వీటి ద్వారా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రకటన చేశారు. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన 120 జిల్లాలు, 50 బ్లాకుల్లో ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన 'సడక్ సురక్ష అభియాన్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లను తెరిచిందని స్పష్టం చేశారు.
Also Read: అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోదీ మీటింగ్ .. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా ?
ప్రస్తుతం దేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షలకు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో 1.8 లక్షల మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. రహదారుల డిజైన్, ఇంజనీరింగ్ పనులు లోపాల వల్లే రోడ్లపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత ఆటో మొబైల్ ఇంజనీరింగ్, చట్టాల అమల్లో లోపాలు, మానవ ప్రవర్తన వల్ల కూడా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. దేశంలో చాలామందికి చట్టం పట్ల భయం, గౌరవం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
Follow Us