/rtv/media/media_files/2026/06/11/fotojet-2-2026-06-11-09-30-14.jpg)
పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అధిక శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న పలు రకాల ఎక్సైజ్ సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం ద్వారా విదేశీ మారక ద్రవ్య వ్యయం తగ్గడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
🚨 HUGE MOVE BY MODI GOVT
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 11, 2026
The Centre has COMPLETELY WAIVED central excise duty on ethanol-blended fuel containing over 20% ethanol 🔥
— If the benefit is passed on, E30 fuel could theoretically be about ₹11.90/litre CHEAPER than regular petrol 🤯 pic.twitter.com/4iyN0yTgXH
ఈ నేపథ్యంలో ఇథనాల్ వినియోగాన్ని మరింత పెంచేందుకు తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా మాఫీ చేయనుంది. దీంతో ఈ రకమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కంపెనీలకు, వినియోగదారులకు కొంత మేర ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను మార్కెట్లో మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేవలం సాధారణ ఎక్సైజ్ సుంకమే కాకుండా ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం రద్దు చేసింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడం, కాలుష్యం నియంత్రణ, రైతులకు మద్దతు, బయోఫ్యూయల్ రంగానికి ప్రోత్సాహం వంటి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Follow Us