స్కూల్‌లో టవల్‌తో అమ్మాయిల డ్యాన్స్‌.. స్పందించిన మానవ హక్కుల కమిషన్

కోల్‌కతాలోని ఇటీవల ఓ పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిలు టవల్‌తో స్టేజీ మీద డ్యాన్స్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జాతీయ మానవ హక్కుల చట్టం కమిషన్ (NHRC) స్పందించింది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

New Update
Girls Towel Dance Controversy, NHRC Sent notice to school management

Girls Towel Dance Controversy, NHRC Sent notice to school management


కోల్‌కతాలోని ఇటీవల ఓ పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిలు టవల్‌తో స్టేజీ మీద డ్యాన్స్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా మానవ హక్కుల చట్టం కమిషన్ (NHRC) స్పందించింది. మైనర్ బాలికలతో ఇలా అసభ్యకరంగా డ్యాన్స్ చేయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. 

Also Read: 'నాకు నయనాతారా కావాలి.. నా కల నెరవేరుస్తారా'.. ఎంపీ వింత కోరిక

ఇక వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్‌ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్‌ జిల్లాలో CBSE గుర్తింపు పొందిన ఓ పాఠశాల ఉంది. ఇక్కడ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ స్కూల్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ఇద్దరు మైనర్ విద్యార్థులు తెల్లటి టవల్‌ చుట్టుకొని బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థులతో ఇలాంటి డ్యాన్సులు చేయించడం ఏంటని మండిపడ్డారు. 

Also Read: ఇరాన్‌కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక నేత హతం

ఈ క్రమంలోనే ఈ ఘటనపై కొందరు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు. దేశంలోని అన్ని విద్యాసంస్థలు, ఇతర వేదికల్లో మైనర్ బాలికలతో ఇలాంటి అసభ్యకరమైన డ్యాన్సులు చేయించడం నిషేధించాలని కోరారు. దీంతో NHRC ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.  

Advertisment
తాజా కథనాలు