/rtv/media/media_files/2026/04/17/ambandi-and-gautam-adani-2026-04-17-16-44-02.jpg)
Gautam Adani Becomes Asia’s Richest Person, Overtakes Mukesh Ambani
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గత కొన్నేళ్ల నుంచి ఈ లిస్టులో టాప్‌లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశారు. వీళ్లిద్దరూ ప్రపంచంలోనే టాప్ 20 సంపన్నుల జాబితాలో చోటు దక్కించున్నారు. ఆదానీ 19 స్థానంలో ఉండగా, అంబానీ 20వ స్థానానికి వచ్చారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీది 92.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇటీవల అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఆయన అత్యంత సంపన్న వ్యక్తిగా చోటు దక్కించుకున్నారు. అదానీ పవర్ 1 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 2 శాతం, అదానీ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అలాగే ఇతర కంపెనీల స్టాక్స్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఈ స్టాక్ ధరలు, వ్యాపార పనితీరు మార్పు వల్ల ర్యాంకులు మారుతుంటాయి.
Also Read: కాసేపట్లో డీలిమిటేషన్‌పై ఓటింగ్.. మారుతున్న రాజకీయ పరిణామాలు
అంతర్జాతీయ స్థాయిలో
1. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మొదటి స్థానంలో ఉన్నారు.
2. ల్యారీ పేజ్ (286 బిలియన్ డాలర్లు)
3.జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు)
4.సెర్గే బ్రిన్ (266బిలియన్ డాలర్లు)
5.మార్గ్ జుకర్‌బర్గ్ (239 బిలియన్ డాలర్లు)
6.ల్యారీ ఎల్లిసన్ (230 బిలియన్ డాలర్లు)
7.మిచెల్ డెల్ (170 బిలియన్ డాలర్లు)
8.జెన్‌సెన్ హువాంగ్ (164 బిలియన్ డాలర్లు)
9.బెర్నార్డ్ ఆర్నాల్ట్ (164 బిలియన్ డాలర్లు)
10.జిమ్ వాల్టన్ (150 బిలియన్ డాలర్లు)
టాప్ 20లో గౌతమ్ అదానీ 19, ముకేశ్ అంబానీ 20వ స్థానంలో ఉన్నారు. అలాగే భారత్ నుంచి లక్ష్మీ మిత్తల్, శివ్ నాడార్, షాపూర్ మిస్త్రీ అండ్ కుటుంబం, సావిత్రి జిందాల్, సునీల్ మిత్తల్ అండ్ కుటుంబం, అజీమ్ ప్రేమ్‌జీ, కుమార మంగళం బిర్లా, రాధాకృష్ణ ధమానీ సైతం బిలియనీర్ ఇండెక్స్‌లో ఉన్నారు.
Follow Us