Negligence of private doctors : ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టిన ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం తీరడం లేదు. డబ్బులుంటేనే వైద్యం అనేలా వ్యవహరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహారాష్ర్ట లోని పూణేలో వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా ఏడునెలల గర్భిణి అర్ధాంతరంగా తనువు చాలించింది. వివరాలప్రకారం...
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
పూణేకు చెందిన తనిషా భిసే.. ఏడు నెలల గర్భిణి. ఆమెకు స్కానింగ్‌లో కవలలు అని తేలింది. మరో రెండు నెలలు ఆగితే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చేది. అలాంటి తనిషాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్లుండి నొప్పులు రావడంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందంచాల్సిన డాక్టర్లు ఏకంగా పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత సొమ్ము లేదని చెప్పడంతో.. ఆస్పత్రిలో చేర్చుకోలేదు. తర్వాత ఇస్తామని ఎంత బతిమిలాడినా కనికరించలేదు. ఆమె భర్త 2.5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. అయినా చేర్చుకోలేదు.చేసేదేంలేక తనిషాను మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. చివరకు కన్ను మూసింది. పాపం ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి మురిసిపోవాల్సిన తల్లి.. వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించింది.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
మరో రెండు నెలల గడిస్తే ఆనందంగా కవలలను చూసి మురిసిపోవలసిన తనిషా అర్థంతరంగా తనువు చాలించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం అందించాల్సిన డాక్లర్ల నిర్లక్ష్యం నిండుగర్బిణి ప్రాణం తీసింది. మరో రెండు నెలల్లో కవల పిల్లలకు జన్మనివ్వాల్సిన తనిషా అర్ధాంతరంగా తనువు చాలించడాన్ని.. ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అంతేకాక వైద్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని.. చికిత్స ఇచ్చి ఉంటే తన భార్య బతికి ఉండేదని ఆమె భర్త ఆవేదన వ్యక్తం చేశారు. "ఆస్పత్రి వాళ్లు.. ప్రాణం కన్నా డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా నా భార్య చనిపోయింది. వారు కనుక వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని ఉంటే నా భార్యకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తను బతికి ఉండేది" అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తనిషా బంధువు కూడా ఈ విషయమై స్పందిస్తూ "నేను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ప్రత్యేక అధికారినని చెప్పినా సరే ఆస్పత్రి వాళ్లు తనిషాను అడ్మిట్ చేసుకోలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మరణించింది" అని వాపోయాడు.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!