/rtv/media/media_files/2025/04/03/fNnEcbUO5xXCHGe0awcP.jpg)
Emergency landing 123 Photograph: (Emergency landing 123)
ముంబై రావాల్సిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్‌బాకిర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారే. దీంతో ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. వారంతా లండన్ నుంచి ముంబైకి బయలుదేరారు. దీంతో సుమారు 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. 16 గంటలకు పైగా పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విమానంలోని ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో టర్కీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం
Received a distress call from a passenger on @VirginAtlantic flight VS358 from #London to #Mumbai , now stranded in #DiyarbakirAirport in #Turkey - apparently a military facility - emergency landing .
— loveena tandon (@loveenatandon) April 3, 2025
It’s been 20hours without any concrete communication from airline or food or… pic.twitter.com/RE4h2JiHYe
Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’
టర్కీలోని ఆ విమానాశ్రయం విమానాల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సాంకేతిక లోపం వల్ల ఆ విమానం అక్కడి నుంచి టేకాఫ్ కాలేకపోయింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమాన సిబ్బంది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులు ఖాళీగా ఉన్న చిన్న టెర్మినల్ బిల్డింగ్‌లో 16 గంటలకుపైగా వేచి ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ప్రయాణికుల్లో ఉన్నారు.