/rtv/media/media_files/2026/05/20/facebooks-parent-company-meta-is-preparing-for-massive-job-cuts-2026-05-20-10-48-17.jpg)
Facebooks Parent Company Meta Is Preparing For Massive Job Cuts
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా' ప్రపంచవ్యాప్తంగా మరోసారి భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమయ్యింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మే 20న ఏకంగా 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 10 శాతానికి సమానమని తెలుస్తోంది. కేవలం లేఆఫ్స్ కాకుండా.. కృత్రిమ మేధ (AI) విభాగాలపై ఫోకస్ పెట్టేందుకు మరో 7,000 మంది ఉద్యోగులను వివిధ బృందాల్లోకి బదిలీ చేయాలని మెటా నిర్ణయించింది. ప్రస్తుతం 78,000 లోపు ఉన్న సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే.. తాజా తొలగింపులు అంతర్గత బదిలీల ఎఫెక్ట్ 20 శాతం సిబ్బందిపై పడనుంది.
Also Read: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అలా చేస్తే అకౌంట్లోకి వెంటనే రూ. లక్ష!
ఈ భారీ లేఆఫ్స్, బదిలీలకు సంబంధించిన వివరాలను మెటా యాజమాన్యం అంతర్గత మెమో ద్వారా సోమవారం ఉద్యోగులకు వెల్లడించింది. ఈ తొలగింపుల ప్రక్రియ వల్ల మే 20న మూడు వేరువేరు దశల్లో సాగనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. బాధితులకు ఉదయం 4 గంటల నుంచే ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందినట్లు చెప్పింది. ఉద్యోగ నష్టానికి గురైన వాళ్లు, ఇతర విభాగాలకు మారే వాళ్ల వివరాలను ఈ మెయిల్స్ ద్వారా విడివిడిగా పంపినట్లు సంస్థ వెల్లడించింది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఏఐ విభాగాన్ని బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: ప్రధాని మోదీపై జాత్యాహంకార కార్టున్.. నార్వే పత్రికపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
టెక్ రంగంలోనే కాక బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కలకలం రేపుతోంది. యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం 'స్టాండర్డ్ చార్టర్డ్' సైతం భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. 2030 నాటికి తమ సంస్థలో 7,800 మంది ఉద్యోగులను తీసివేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ఈ బ్యాంక్ ప్రకటించింది. ఇది వాళ్ల మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 15 శాతానికి సమానంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 82 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఆసియా మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన స్టాండర్డ్ చార్టర్డ్, తన బ్యాక్ ఆఫీస్ నిర్వహణను తగ్గించుకోవాలని నిర్ణయించింది. అలాగే ఆ స్థానంలో కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఎక్కువగా వాడుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే వేలాది సంఖ్యలో ఉద్యోగులపై వేటు పడనుంది.
Follow Us