MH: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..గుండెపోటుతో వాహనాలపైకి దూసుకెళ్ళిన కారు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు నియంత్రణ కోల్పోయి పక్కనున్న బైక్ ల మీదకు దూసుకెళ్ళింది. ఈ ప్రమాందోల నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
CAR ACCIDENT

ఠాణె జిల్లాలోని అంబర్ నాథ్ ఫ్లై ఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా..ఆమె కారు డ్రైవర్ లక్ష్మణ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అతనికి వాహనం మీద నియంత్రణ కోల్పోయింది. ఈ క్రమంలో బైక్ లు, వాహనాలను కారుతో ఢీకొట్టారు. కారు వేగంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి బైక్‌తో సహా ఎగిరి ఫ్లైఓవర్‌ కింద పడ్డారు. అంతేకాదు కారుకూడా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షిండేతో పాటూ మరో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయరు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కిరణ్ చాబే కూడా కారులోనే ఉన్నారు. ామెకు కూడా తీ్రగాయాలయ్యాయి. కిరణ్ ను కారు నుంచి బయటకు లాగి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు