/rtv/media/media_files/2025/03/01/14FgI2vbAWR3ZMAx3Dkn.jpg)
Double Baraat of Two Grooms in Indian Gay Wedding Viral video
సాధారణంగా పెళ్లి అంటే ఒక వధువు, వరుడు, ఇరు కుటుంబ సభ్యులు ఉంటారు. ఇతర బంధువులు, స్నేహితుల మధ్య తమ పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకోవడం ఎప్పుడైనా చూశారా?. అవును మీరు విన్నది నిజమే.. ఇద్దరు పురుషులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. దీంతో తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. చివరికి ఇరుకుటుంబాల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఇలాంటి కల్చర్ ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు ఇండియాకి సోకింది.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
భారతీయ ‘గే’ జంట పెళ్లి
ప్రస్తుతం భారతీయ ‘గే’ జంట డబుల్ బారాత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అర్జున్ కుమార్, సంచిత్ అనే ఇద్దరు వరులు డ్యాన్స్‌లతో సందడి చేశారు. ఇక వీరితో పాటు ఇరు ఫ్యామిలీల తల్లి దండ్రులు కూడా సందడి చేశారు. ఆ వీడియోను 'aka_naach' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘ My First Indian Gay Wedding.. Double Baraat + Boliyaan Were Epic and Wholesome’’ అని రాసుకొచ్చారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం
వీడియోపై రెస్పాన్స్
ఈ వీడియోపై ఇన్‌స్టాలో లైక్‌ల వర్షం కురుస్తోంది. ఈ వార్త రాసే సమయానికి దాదాపు 89,790 లైక్స్ వచ్చాయి. దీనిపై పలువురు స్పందిస్తున్నారు. కొందరు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొందరు ఘోరంగా విమర్శిస్తున్నారు. అందులో ఒకరు స్పందిస్తూ.. ఈ జంట చాలా అందంగా ఉందని కామెంట్ చేశారు. మరొకరు.. అన్ని రూపాల్లో ప్రేమను వ్యక్త పరచడం, స్వీకరించడం బాగుందని ఆ కామెంట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండింగ్ అవుతోంది.
Also Read: HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి