/rtv/media/media_files/2026/02/15/ansar-interim-2026-02-15-16-49-31.jpg)
Doctors formed outfit ‘Ansar Interim’ to carry out attack
ఢిల్లీ ఉగ్రపేలుడు కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్ర డాక్టర్లు అందరూ కలిసి 'అన్సార్ ఇంటీరియం' అనే పేరుతో కొత్త ఉగ్రవాద సంస్థనే ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజమ్మిల్ గన్నీ, ఉమర్ నబీ, ముజఫర్ మౌల్వీ ఇర్ఫాన్, ఆదిల్, కారీ ఆమిర్, తౌఫిల్ గాజీ.. వీళ్లందరూ కలిసి 2022 ఏప్రిల్‌లో శ్రీనగర్‌లో కలిశారు. అప్పుడే వీళ్లు అన్సార్ ఇంటీరియం అనే సంస్థను ఏర్పాటుచేశారు. దీనికి చీఫ్‌గా ఆదిల్‌ను, డిప్యూటీ చీఫ్‌గా మౌల్వీ ఇర్ఫాన్‌ను నియమించారు.
ఎవరు ఏ పని చేయాలనేది ముందుగానే అరెస్టయిన ఉగ్ర డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఆపరేషనల్ కోడ్స్ కూడా రెడీ చేసుకున్నారు. ఈ గ్రూప్‌కు ఉమర్ సమన్వయకర్తగా, గన్నీ ఫైనాన్స్, కొనుగోళ్ల విభాగాలు చూసుకునేవాడు. వీళ్లు 2023లో పేలుళ్లకు కావాల్సిన మెటీరియల్, ఎరువులను సోహ్మ నుంచి కొనుగోలు చేశారు. ఉమర్ సూచనల మేరకు ఫరీదాబాద్‌లోని ఓ కెమికల్ షాప్ నుంచి పొటాషియం నైట్రేట్‌ను తెప్పించుకున్నారు.
Also Read: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారానికి డేట్ ఫిక్స్.. ఇండియా ప్రధాని మోదీకి ఆహ్వానం
ఆన్‌లైన్ వీడియోలను చూసి ఉమ్ ఐఈడీలను తయారుచేయడం నేర్చుకున్నాడు. ఇక ఆదిల్.. సౌత్ కశ్మీర్‌కు చెందిన డానిష్‌ను అల్‌ఫలా యూనివర్సిటీకి తీసుకొచ్చి ఉంచాడు. అతనితో ముందుగా దాడి చేయించాలని ఉమర్ అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో ప్లాన్ ఆపేశారు. ఈ ఉగ్ర వైద్యుల గ్రూప్‌లో ఉమర్ ఎక్కువగా ర్యాడికలైజ్డ్ అయిన వ్యక్తిగా ఉన్నాడు.
ఈ గ్రూప్ సభ్యులు ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో లేదా ఏదైన ప్రార్థనా మందిరం వద్ద లేదా కారుబాంబును పేల్చాలని కుట్ర పన్నాయి. చివరికి శ్రీనగర్ పోలీసులు ఈ గ్రూప్ ప్లాన్‌ను ముందుగానే పసిగట్టింది. దీంతో ఉమర్ ఆందోళన, ఒత్తిడికి గురయ్యాడు. చివరికి ఢిల్లీలోని ఓ కారులో పేలుడుకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు 2016, 2018లో ఉగ్ర సంస్థల్లో చేరేందుకు యత్నించి విఫలమైనట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలాఉండగా గతేడాది నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఐ20 కారులో బాంబు పేలుడు ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు ఒప్పందంపై రాజీకి సిద్ధం !
Follow Us