Divorce : వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేము.. కోర్టు సంచలన కామెంట్స్!

వాట్సాప్ చాట్‌ల ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. భార్యకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా

New Update
high court

వాట్సాప్ చాట్‌ల ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు  కొట్టివేసింది. భార్యకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, కేవలం చాటింగ్ స్క్రీన్ షాట్ల ఆధారంగా కింద విడాకులు ఇవ్వడం చెల్లదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధ్వజపీఠం గత వారం నాసిక్ జిల్లా ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ తీర్పు ఇచ్చారని సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

వాట్సాప్ చాట్‌లను ఆధారంగా

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2025 మే నెలలో నాసిక్ ఫ్యామిలీ కోర్టు భర్త దాఖలు చేసిన వాట్సాప్ చాట్‌లను ఆధారంగా చేసుకుని విడాకులు మంజూరు చేసింది. ఆ చాట్‌లో భార్య తన అత్తామామలపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని, విడిగా ఉండాలని ఒత్తిడి చేస్తూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిందని భర్త ఆరోపించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు, ఆమె ప్రవర్తన భర్తపై క్రూరత్వానికి నిదర్శనమని పేర్కొంటూ విడాకులు ఇచ్చింది. అయితే, ఈ సాక్ష్యాలను భార్య తప్పుబట్టేందుకు లేదా వాటిపై వివరణ ఇచ్చేందుకు కింది కోర్టు ఏమాత్రం అవకాశం కల్పించలేదని హైకోర్టు గుర్తించింది.

సరైన సాక్ష్యాలతో నిరూపించకుండా

కేవలం వాట్సాప్ చాట్‌లను చూసి, వాటిని సరైన సాక్ష్యాలతో నిరూపించకుండా విడాకుల డిగ్రీ ఇవ్వడం చట్టబద్ధం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందుకే, విడాకుల ఉత్తర్వులను పక్కన పెట్టి, ఈ కేసును తిరిగి విచారించాలని ఫ్యామిలీ కోర్టుకు అప్పగించింది. భార్య తన వాదనలు, సాక్ష్యాలను సమర్పించడానికి పూర్తి అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఈ కేసును కొత్తగా విచారించే సమయంలో, విడిపోయిన ఈ దంపతులు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని కోర్టు సూచించింది. 

Advertisment
తాజా కథనాలు