/rtv/media/media_files/2025/02/16/sZdv2NMsYcFJ0qWt8YqO.jpg)
Delhi stampede photos
చిన్న సమాచార లోపం 18 మంది ప్రాణాలు బలగొంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఆదివారం కుంభమేళా వెళ్తున్న భక్తులు తొక్కిసలాట కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే. అనేకమంది గాయాలపాలైయ్యారు. రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై విచారణకు ఇద్దరు అధికారులతో హైలెవల్ కమిటీ నియమించింది ప్రభుత్వం. తొక్కిసలాటకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
2 రైళ్లు ఆలస్యంగా రావడమే.. తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రాథమిక కారణమని తెలిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అనేక మంది కుంభమేళా ట్రైన్‌కోసం వెయిట్ చేస్తుండగా.. చివరి నిమిషంలో స్పెషల్ ట్రైన్ వేయడంతో ప్రయాణికులందరూ స్పెషల్ ట్రైన్ కోసం ఎగబడ్డారు. ట్రైన్ ప్లాట్‌ఫామ్ మారిందని ప్రకటన చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురైయ్యారు. అయితే అలాంటి ప్రకటన ఏం చేయలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Also Read: గుండెపోటుతో వరుడు ఎలా మృతి చెందాడో చూడండి.. వీడియో చూస్తే గుండె పగలాల్సిందే!
అప్పటికే 14వ ప్లాట్ ఫామ్‌పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. అదే సమయంలో 16వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పైకి ప్రయాగ్‌రాజ్ స్పెషల్ వచ్చింది. దీంతో ప్రయాణీకులు అయోమయంలో పడ్డారు. ఒకేసారి ట్రైన్ దగ్గరికి పెద్ద ఎత్తున వెళ్లడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు చెప్పారు. తొక్కిసలాట కారణంగా రైళ్లను రద్దు చేయలేదని, ప్లాట్‌ఫామ్ కూడా మార్పు చేయలేదంటున్న అధికారులు స్పష్టం చేశారు. అన్ని రైళ్లు షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయన్న రైల్వే శాఖ తెలిపింది.