Delhi Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించిన ఆప్‌, బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆప్ తిరస్కరించింది. గతంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవని కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొంది. బీజేపీ కూడా ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపింది.

New Update
BJP and AAP

BJP and AAP

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్‌ కూడా విడుదలయ్యాయి. మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కేకే సర్వే మాత్రం ఆప్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌పై తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించింది. '' తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లో కూడా ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆప్ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ రెండుసార్లు ఆప్ అధికారంలోకి వచ్చిందని'' ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. 

Also Read: 'ఆప్‌ కష్టమే'.. మేజిక్‌ ఫిగర్‌ వచ్చినా బీజేపీకే ఛాన్స్ !

ఈ ఎగ్జిట్ ఫలితాలపై బీజేపీ నేత, కాల్కాజీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి రమేశ్‌ బిధూరి కూడా స్పందించారు. '' ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది. ఇలాంటి మార్పును ఢిల్లీ ప్రజలు కూడా కోరుతున్నారు. అధిష్టానం వ్యూహాలు, మా పార్టీ కార్యకర్తల శ్రమ ఫలిస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌పై మాకు నమ్మకం లేదు. సీట్ల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. బీజేపీకి 50 కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని'' రమేశ్ బిధూరి అన్నారు.  

Also read: ట్యాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వ పథకాలు బంద్!

ఇదిలాఉండగా మొత్తం 70 స్థానాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈసారి చూసుకుంటే మెజార్టీ సర్వేలు బీజేపీ అధికారమని తేల్చిచెప్పాయి. పీపుల్స్ పల్స్ అనే ప్రముఖ సంస్థ బీజేపీ ఏకంగా 51 నుంచి 60 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకే పరిమితం అవుతుందని తమ సర్వేలో వెల్లడించింది. అలాగే చాణక్య స్ట్రాటజీ, ఆపరేషన్ చాణక్య, పీపుల్ ఇన్‌సైట్, పీ మార్క్ లాటి పలు సర్వేలు కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టమైన మెజార్టీ ఇచ్చాయి. కేకే సర్వే మాత్రం ఆప్‌ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు