Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్‌ జోన్‌లో ఢిల్లీ

ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
Air Pollution: వాయు కాలుష్యంతో క్యాన్సర్‌ ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు బీభత్సంగా కమ్మేసింది. గత రెండు రోజుల నుంచి గాలిలో నాణ్యత లేదు. ఈ రోజు వాయు నాణ్యత సూచీ 428గా నమోదైంది. తీవ్ర స్థాయిలో ఢిల్లీలో గాలి కలుషితం కావడంతో పలు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే దాదాపుగా 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 5వ తరగతి వరకు స్కూల్ విద్యార్థులకు వర్చువల్ క్లాస్‌లు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఢిల్లీ సీఎం అతిశీ తెలిపారు. 

ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

విమానాలు, రైళ్ల రాకపోకలకు ఆటంకం..

ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్ విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషన్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సుమారుగా 300కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందులో 115 విమానాలు ఢిల్లీకి వచ్చేవి ఉండగా.. ఇక్కడి నుంచి వెళ్లేవి 226 విమానాలు ఉన్నాయి. కొన్నింటిని దారి కూడా మళ్లించారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోలకపై కూడా తీవ్ర ప్రభావం పడింది. 

ఇది కూడా చూడండి:  మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే

ఢిల్లీలో ఉండే కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గాలి నాణ్యతను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీలో చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

ఇదిలా ఉండగా ఢిల్లీలో బీభత్సమైన పొగమంచుపై ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ.. కేరళలో వయనాడ్‌ నుంచి దిల్లీకి వచ్చాను. అక్కడ వాయు నాణ్యత సూచీ 35 ఉండగా ఇక్కడ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీకి వస్తే గ్యాస్‌ చాంబర్‌లోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల!

Advertisment
Advertisment
తాజా కథనాలు